బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన ఐశ్వర్యరాయ్ ఈ మధ్యకాలంలో సినిమాలలో తక్కువగా కనిపించిన సోషల్ మీడియాలో మాత్రం అప్పుడప్పుడు తన కుటుంబానికి సంబంధించిన విషయాలను షేర్ చేస్తూ ఉంటుంది. అయితే తాజాగా ఐశ్వర్యరాయ్ ప్రయాణిస్తున్నటువంటి కారును సైతం ఒక బస్సు ఢీ కొట్టిందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సంఘటన నిన్నటి రోజున మధ్యాహ్నం ఐశ్వర్యరాయ్ ఇంటి  సమీపంలో జరిగినట్లు తెలుస్తోంది. ఈ విషయం విన్న అభిమానులు ఆందోళన చెందుతున్నారు.


అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని..కాని ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఎవరెవరు ఉన్నారని విషయం మాత్రం ఇంకా అధికారికంగా బయటపడలేదు మరొకవైపు కారు ప్రమాదానికి సంబంధించిన కొన్ని వీడియోలు ఇప్పుడు వైరల్ గా మాధ్యమికాలలో మారుతున్నాయి. ఇందులో ఒక కారును బస్సు ఢీకొన్నట్టుగా మాత్రమే కనిపిస్తోంది. ఈ కారు ఐశ్వర్యరాయ్ ది అన్నట్టుగా అక్కడ ఉండే స్థానికులు తెలియజేస్తున్నారు. ఇలా బస్సు కారు ను ఢీ కొట్టిన తర్వాత భారీగా ట్రాఫిక్ జామ్ అవ్వడంతో ప్రమాదం జరిగిన తర్వాత బాడీగార్డ్ కారుని అక్కడే వదిలేసి వెళ్లిపోయినట్లు సమాచారం


అయితే ఇందులో ఎవరికి కూడా ఏలాంటి నష్టం జరగలేదని తెలియడంతో కొంతమేరకు అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఐశ్వర్యరాయ్ చివరిసారిగా పోన్నియన్ సెల్వన్ మొదటి రెండు భాగాలలో కూడా నటించింది. ఆ తర్వాత మళ్లీ ఏ సినిమాలో కూడా నటించ లేదు ఐశ్వర్యారాయ్.. గత కొంతకాలంగా విడాకుల  రూమర్స్ విషయంలో కూడా వైరల్ గా మారింది. ఇప్పుడు తాజాగా ఈ ప్రమాదం గురించి ఐశ్వర్యరాయ్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. మరి ఈ విషయం పైన అటు ఐశ్వర్యారాయ్ కుటుంబం కానీ ఆమె కానీ ఏ విధంగా క్లారిటీ ఇస్తుందో చూడాలి మరి. మొత్తానికి ఐశ్వర్యరాయ్ కు ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలిసి అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: