ప్రభాస్ పెళ్ళంటూ న్యూస్ వస్తే ఆయన అభిమానుల్లో పండగ వాతావరణం నెలకొంటుంది.అయితే అలాంటి ప్రభాస్ పెళ్లి జరగడానికి మరికొద్ది రోజులే సమయం ఉందని, ఇప్పటికే పెళ్లి పనులు కూడా స్టార్ట్ చేసినట్టు టాలీవుడ్ సినీ వర్గాలలో కొంతమంది మాట్లాడుకుంటున్నారు. మరి ఇంతకీ ప్రభాస్ పెళ్లి అంటూ వార్తలు వస్తున్నవి రూమర్సా లేక నిజంగానే ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నారా అనేది చూద్దాం. ప్రభాస్ పెద్దమ్మ కృష్ణంరాజు భార్య శ్యామలా దేవి ఎక్కడ ఏ ఇంటర్వ్యూలో కనిపించినా కూడా తన కొడుకు పెళ్లి త్వరలోనే జరగబోతుంది అంటూ చెబుతుంది. అలా గత ఏడాది కూడా తన కొడుకు పెళ్లి వచ్చే ఏడాది జరుగుతుంది అని తీపి కబురు చెప్పింది. అయితే తాజాగా శ్యామలాదేవి ప్రభాస్ పెళ్లికి సంబంధించిన పనులన్నీ రహస్యంగా కానిచ్చేస్తున్నట్టు టాలీవుడ్ ఫిలిం సర్కిల్స్ లో ఒక రూమర్ చక్కర్లు కొడుతుంది.

అయితే ఇప్పటికే పలుమార్లు ప్రభాస్ పెళ్ళంటూ వార్తలు వినిపించినప్పటికీ అది ఏది నిజం కాలేదు. అలాగే అనుష్కని పెళ్లి చేసుకోవడానికే ప్రభాస్ ఇన్ని రోజులు వెయిట్ చేస్తున్నారని అందుకే అనుష్క కూడా పెళ్లి చేసుకోవడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి.కానీ వీరి పెళ్లి జరగదని హైదరాబాద్ బిజినెస్ మాన్ కూతురుతో ప్రభాస్ పెళ్లి జరగబోతుందని, ప్రభాస్ హైదరాబాదీ అల్లుడు కాబోతున్నారని ఇలా సినీ వర్గాల్లో ఎంతోమంది ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. అయితే హైదరాబాద్ లో ఉన్న ఓ ప్రముఖ బిజినెస్ మాన్ కూతురిని ప్రభాస్ పెళ్లాడబోతున్నారని ఇక బిజినెస్ మాన్ కి ఒక్కగానొక్క కూతురని,ఆ బిజినెస్ మాన్ ఆస్తులన్నీ ప్రభాస్ ఇంటి అల్లుడు అయితే ఆయనకే చెందుతాయని సోషల్ మీడియాలో రూమర్స్ వినిపిస్తున్నాయి.

 ఇప్పటికే శ్యామలాదేవి ఎంగేజ్మెంట్ కి కావాల్సిన పనులన్నీ కూడా గుట్టు చప్పుడు కాకుండా సైలెంట్ గా చేస్తుందని తెలుస్తోంది. మరి ప్రభాస్ పెళ్ళంటూ వార్తలు వచ్చేవి రూమర్సా లేక నిజాలా అనేది తెలియాల్సి ఉంది.ఇక ప్రభాస్ ప్రస్తుతం ది రాజా సాబ్, స్పిరిట్, కల్కి టు, సలార్ టు, ఫౌజి వంటి సినిమాలు చేస్తున్నారు. ఇక రీసెంట్ గానే ప్రభాస్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు వేణు స్వామి. ప్రభాస్ ఆరోగ్యం సహకరించదని, ఆయన కి ప్రాణగండం ఉంది అని, ఆయనకి ఉన్న ఆరోగ్య సమస్యల కారణంగానే ది రాజా సాబ్ మూవీని వాయిదా వేయబోతున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలపై ప్రభాస్ ఇప్పటివరకు స్పందించలేదు

మరింత సమాచారం తెలుసుకోండి: