అమృతం సీరియల్ నటుడు హర్షవర్ధన్ అంటే అందరికీ తెలిసిన పేరు. హర్షవర్ధన్ అమృతం సీరియల్ ద్వారా ఫేమస్ అవ్వడమే కాకుండా పలు సినిమాల్లో సీరియల్స్ లో కీరోల్స్ పోషించారు. కామెడీ విలన్ గా, విలన్ గా,క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇలా ఎన్నో సినిమాల్లో ఆకట్టుకున్న హర్షవర్ధన్ తాజాగా కొన్ని ఇంటర్వ్యూలు ఇస్తూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టారు. గతంలో నితిన్ గుండెజారి గల్లంతయ్యిందే సినిమా సమయంలో తనని అవమానించారని,నితిన్ తనని స్టేజి మీదకి పిలిచి గౌరవిస్తారు అనుకుంటే పిలవకుండా అవమానించారని,ఆ తర్వాత నితిన్ మాత్రం అది మీ సినిమా మీరు చూసుకోవాలి కాని చిన్న దానికే ఎందుకు రాద్దాంతం చేస్తున్నారని నన్ను ప్రశ్నించారంటూ హర్షవర్ధన్ చెప్పుకొచ్చారు. అయితే హర్షవర్ధన్ కి 50 ఏళ్లకు పైగానే ఏజ్ వచ్చినప్పటికీ ఇంకా పెళ్లి మాత్రం చేసుకోవడం లేదు. ఇక ఈయన పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఓ అమ్మాయట.

 ఆ అమ్మాయి కారణంగానే హర్షవర్ధన్ పెళ్లికి దూరంగా ఉన్నారట. మరి ఇంతకీ హర్షవర్ధన్ ని మోసం చేసిన ఆ అమ్మాయి ఎవరు.. ఎందుకు పెళ్లి చేసుకోవడం లేదు అనేది ఇప్పుడు చూద్దాం.హర్షవర్ధన్ తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొని తన లవ్ ఫెయిల్యూర్ స్టోరీ చెప్పారు. ఆయన మాట్లాడుతూ.. నేను ఓ అమ్మాయిని దాదాపు ఏడేళ్ళు గాఢంగా ప్రేమించాను. అయితే ఆ అమ్మాయి కూడా నన్ను ప్రేమించింది. మేమిద్దరం పీకల్లోతు ప్రేమలో మునిగి పెళ్లి చేసుకోవాలి అనుకున్నాం. అలాగే పిల్లల్ని కనకుండా పిల్లల్ని దత్తత తీసుకోవాలి అని నిర్ణయించుకున్నాం.కానీ ఆ తర్వాత ఆ అమ్మాయి నన్ను మోసం చేసి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఇక ఆ అమ్మాయి పెళ్లి చేసుకునే రెండు నెలల ముందు కనీసం ఆమెకు టైం ఇవ్వకుండా బిజీ వర్క్ లో నేను మునిగిపోయాను. దాంతో ఆమె నేను స్టేజ్ మీద అవార్డు తీసుకున్న సమయంలో పెళ్లి చేసుకున్నట్టు నాకు సమాచారం అందింది.

బహుశా ఆ అమ్మాయిని నేను పట్టించుకోకపోవడంతో ఆమె విసుగు చెంది వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంది కావచ్చు అనుకున్నాను.కానీ ఆ టైంలోనే ప్రేమ పెళ్లి పై ఆశలు పోయాయి. ఒక్క మాట కూడా చెప్పలేదని బాధపడ్డాను. అప్పటినుండి పెళ్లి చేసుకోకూడదు అని ఫిక్స్ అయ్యాను. ఆ అమ్మాయి చేసిన మోసం కారణంగా పెళ్లికి దూరంగా ఉన్నాను అంటూ హర్షవర్ధన్ చెప్పుకొచ్చారు. అలాగే పిల్లల దత్తత విషయం గురించి మాట్లాడుతూ.. 15 ఏళ్ల క్రితం పిల్లల్ని దత్తత తీసుకోవాలి అనుకున్నాను.కానీ పిల్లల్ని పెంచడం కంటే మరో టైం వేస్ట్ పని లేదు అనుకున్నాను. అయితే ఇలా అనుకుంటే నేను కూడా పుట్టే వాడిని కాకపోవచ్చు.కానీ నాకు అది కుదరదు అనిపించింది.అందుకే దత్తత తీసుకోలేదు అంటూ హర్షవర్ధన్ చెప్పుకొచ్చారు.ఇక హర్షవర్ధన్ చిన్నదాన నీకోసం, పౌర్ణమి, గీతాంజలి, అలవైకుంటపురంలో,హిట్ -2 వంటి ఎన్నో సినిమాల్లో నటించారు. ముఖ్యంగా ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన జాంబిరెడ్డి మూవీలో హీరో తేజ సజ్జా తండ్రి పాత్రలో హర్షవర్ధన్ నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: