ప్రస్తుతం ఏ ఇండస్ట్రీలో చూసిన భారీ బడ్జెట్ చిత్రాలే విడుదలవుతున్నాయి. చిన్న, పెద్ద హీరోలని తేడా లేకుండా భారీ బడ్జెట్లోనే సినిమాలు విడుదల చేస్తున్నారు. ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాలంటు రిలీజ్ చేస్తూ ఉన్నారు దర్శక ,నిర్మాతలు. అయితే ఇందులో కొన్ని సినిమాలు విజయాలను అందుకోగా మరికొన్ని ఘోరమైన డిజాస్టర్స్ గా మిగిలిపోతున్నాయి. ముఖ్యంగా కొన్ని వేల కోట్ల రూపాయల బడ్జెట్ పెడితే ఆ సినిమా కొన్ని సెకండ్ల సన్నివేశాల కోసమే కోట్ల రూపాయలు ఖర్చుపెట్టిన చిత్రాలు ఉన్నాయి. అందులో ఉదాహరణకు భారతీయుడు 2 సినిమాని కూడా చెప్పుకోవచ్చు.


డైరెక్టర్ శంకర్సినిమా తెరకెక్కించిన భారీ ఫ్లాప్గా మిగిలిపోయింది.. ఈ సినిమా సక్సెస్ కావాలని కోరికతో సుమారుగా 200 కోట్ల రూపాయలు బడ్జెట్ తో తెరకెక్కించగా అనూహ్యంగా ఈ సినిమా 500 కోట్ల రూపాయల వరకు చేరిందట. ఇక శంకర్ సినిమాలు ఏ రేంజ్ లో ఉంటాయో చెప్పాల్సిన పనిలేదు.. ఈయన ఎక్కడ కూడా క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కూడా అవ్వరు. అలా జీన్స్ సినిమాలో ఒక పాట కోసం 7 వండర్స్ ని తిప్పి చూపించారు డైరెక్టర్ శంకర్.


ఇండియన్ 2 సినిమా కోసం భారీగా ఖర్చుపెట్టిన శంకర్ ఇందులో కొన్ని సన్నివేశాల కోసం కాస్ట్లీ సాహసాలు కూడా చేశారు.. ఈ సినిమాలో ఒక సన్నివేశం కోసం ఏకంగా 5 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు సమాచారం. భారీ యాక్షన్  సన్నివేశం కూడా కాదు, అలాగే ఒక అర్థగంట డ్యూరేషన్ అయిన ఉంటుందేమో అని అనుకుంటూ ఉంటారు.. కానీ కేవలం 5 సెకండ్ల సన్నివేశం కోసం మాత్రం 5 కోట్ల రూపాయలు ఖర్చు చేశారట. అదే ఎస్ జె సూర్య ఉండేటువంటి ఇల్లు సిన్ .. భారతీయుడు 2 చిత్రంలో ఎస్ జె సూర్య ఉండేటువంటి ఇల్లు సన్నివేశం కేవలం 5నిమిషాలలోనే కనిపిస్తుంది. ఇందుకోసం 5 నుంచి 8 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసినట్లు టాక్ వినిపిస్తోంది. అలాగే భారతీయుడు 3 సినిమా షూటింగ్ కూడా కొంతమేరకు అయిపోయింది. అందులో కూడా ఈ ఇంటికి సంబంధించి కొన్ని సన్నివేశాలను తీసినట్లు తెలుస్తోంది. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ మొత్తానికి ఈ విషయం వైరల్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: