
ఇప్పుడు ఈ ట్రెండ్ ను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ఈవారం విడుదల కాబోతున్న మీడియం రేంజ్ సినిమా ‘రాబిన్ హుడ్’ చిన్నసినిమా ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రయత్నాలు చేస్తూ ఉండటం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. నితిన్ నటించిన రాబిన్ హుడ్ కు ఏపి ప్రభుత్వం సింగల్ స్క్రీన్ 50 మల్టీప్లెక్స్ 75 రూపాయల చొప్పున ప్రతి టికెట్ మీద ఏడు రోజుల పాటు పెంచుకోవడానికి జిఓ జారీ చేసింది అన్న వార్తలు మీడియాలో వినిపిస్తున్నాయి.
చిన్న సినిమాగా విడుదల అవుతున్న ‘మ్యాడ్ స్క్వేర్’ కూడా ఇదే మార్గాన్ని అనుసరించే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. వాస్తవానికి నితిన్ నటిస్తున్న ‘రాబిన్ హుడ్’ మూవీ కేవలం 100 కోట్ల బడ్జెట్ పూర్తి అయింది అని అంటున్నారు. దీనితో ఈ మీడియం రేంజ్ సినిమా కూడ ఏధైర్యంతో టిక్కెట్ రేట్ల పెంపు వైపు అడుగులు వేసింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
అంతేకాదు ఒక మీడియం రేంజ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచితే జనం చూస్తారా అన్న అభిప్రాయాలు కూడ ఇండస్ట్రీలోని మరికొందరు వ్యక్త పరుస్తున్నారు. మరికొందరైతే ‘రాబిన్ హుడ్’ ఘనవిజయం పై నమ్మకంలేక ఈ మూవీ నిర్మాతలు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారా అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఎలా ఉన్నా ‘రాబిన్ హుడ్’ సినిమాకు టిక్కెట్ రేట్ల పెంపు ఇండస్ట్రీ వర్గాలలో రకరకాల చర్చలకు కారణం అవుతోంది..