టాలీవుడ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాణ సంస్థగా పేరు గాంచిన యువీ క్రియేషన్స్ ప్రభాస్ సొంత నిర్మాణ సంస్థగా పేరు గాంచింది. సినిమాల జయాపజయాలతో సంబంధం లేకుండా గత కొన్ని సంవత్సరాలుగా ఈ నిర్మాణ సంస్థ నుండి వరసపెట్టి సినిమాలు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ఈనిర్మాణ సంస్థ నిర్మిస్తున్న అనేక భారీ సినిమాలు రకరకాల సమస్యలతో విడుదలకు ఆలస్యం అవుతూ ఉండటం టాపిక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.



చిరంజీవితో ఈ నిర్మాణ సంస్థ నిర్మిస్తున్న ‘విశ్వంభర’ మూవీ గత జనవరి 10న విడుదల కావలసి ఉంది. అయితే ఈమూవీ గ్రాఫిక్స్ వర్క్స్ విషయంలో ఆలస్యం జరుగుతూ ఉన్న నేపధ్యంలో ఈమూవీ విడుదల సమ్మర్ లో ఉంటుందని అంతా భావించారు. అయితే ఇప్పుడు ఈసినిమా సమ్మర్ రిలీజ్ కు కూడ రెడీ కాకపోవచ్చనీ ఆగష్టులో వచ్చే చిరంజీవి పుట్టినరోజునాడు ఈమూవీ విడుదల అంటూ ప్రచారం జరుగుతోంది.



పూర్తీ ఫ్యాంటసీ జోనర్ లో నిర్మాణం జరపుకుంటున్న ఈమూవీ కోసం భారీ బడ్జెట్ తో ఖర్చులుపెడుతున్నారు. అయితే ఈసినిమాకు నిర్మాతలు ఊహించిన స్థాయిలో బిజినెస్ జరగకపోవడంతో పాటు ఈమూవీ ఓటీటీ రైట్స్ విషయంలో ఇంకా డీల్ ఫైనల్ కాలేదు అన్న గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. ఈసినిమాను చేస్తూనే అనుష్క లీడ్ రోల్ లో నటిస్తున్న ‘ఘాటీ’ మూవీ వాస్తవానికి ఏప్రియల్ 18న విడుదల కావలసి ఉంది.



అయితే ఈ మూవీకి సంబంధించిన గ్రాఫిక్ వర్క్స్ విషయంలో కూడా ఆలస్యం జరుగుతూ ఉండటంతో ఈ మూవీ కూడ అనుకున్న తేదీకి విడుదల కావడం కష్టం అని అంటున్నారు. దర్శకుడు క్రిష్ డార్క్ క్రైమ్ జానర్ గా ఈమూవీని చాల డిఫరెంట్ గా తీస్తున్నాడు అన్న ప్రచారం జరుగుతోంది. ఈసినిమాని విడుదల చేయడం కోసం ఒకసరైన డేట్ ను ఎంచుకోవడానికి యూవీ క్రియేషన్స్ సంస్థ గట్టి ప్రయత్నాలు చేస్తోంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రెండు సినిమాలతోపాటు అఖిల్ తో అనిల్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ ప్లాన్ చేసుకున్న ప్యాన్ ఇండియా మూవీ చిత్రీకరణ మొదలుకాకుండానే ఆలస్యం అవుతోంది. వరసపెట్టి సినిమాలు చేస్తున్న ఈ ర్మాణ సంస్థ ప్రస్తుతం తన వ్యూహాలలో మార్పులు చేస్తోంది అన్న వార్తలు వస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: