- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ )

టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్ ప్రస్తుతం ‘ ఘాజీ ’ దర్శకుడు సంక‌ల్ప్ రెడ్డి డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే .  శ్రీనివాస్ చిట్టూరి ఈ సినిమా ను నిర్మిస్తున్నారు .. రీసెంట్ గానే ఈ సినిమా షూటింగ్ లాంఛ‌నంగా ప్రారంభమైంది .. త్వరలో నే రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టబోతున్నారు .. అయితే ఇప్పుడు ఈ సినిమా లో హీరోయిన్ గా రితికా నాయ‌క్‌ని ఎంపిక చేసినట్టు తెలుస్తుంది ..


ఇక నిన్న గోపీచంద్ రితికా కు మధ్య ఫోటోషూట్ కూడా జరిగిందట .. దీని పై త్వరలోనే అధికార ప్రకటన కూడా రానుందని అంటున్నారు .. అశోక వనం లో అర్జున కళ్యాణం సినిమా తో రితికా ఆకట్టుకుంది .. అయితే ఆ తర్వాత ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు .. ఇదే క్రమం లో వరుణ్ తేజ్ మూవీ కొరియన్ కనకరాజు లో కూడా హీరోయిన్ గా ఎంపికైంది .. ఈ సినిమా కూడా రీసెంట్ గానే మొదలైంది .. అయితే ఇప్పుడు ఇంత లోనే గోపీచంద్ సినిమా లో కూడా మంచి అవకాశం కొట్టేసింది ..


చారిత్రాత్మక నేపథ్యం ఉన్న కథ కాబట్టి ఇది 7 వ శతాబ్దం లో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమా ను తెరకెక్కిస్తున్నారు .  విజువల్స్ మేకింగ్ విషయం లో సంక‌ల్ప్ రెడ్డి  ప్రత్యేక దృష్టి పెడుతున్నాడు .. గోపీచంద్ 33 వ సినిమా గా ఇది తెరకెక్కుతుంది .. ఆయన కెరియర్ లోనే అత్యధిక బడ్జెట్ తో ఈ సినిమా ని తెరకెక్కిస్తున్నట్టు కూడా తెలుస్తుంది .. ఇతర నటీనటులు , సాంకేతిక నిపుణుల వివరాలు కూడా త్వరలోనే బయటకు రానున్నాయి .  ఇక మరి ఈ సినిమా తో అయినా గోపీచంద్ సక్సెస్ అందుకుంటారో లేదో చూడాలి ..

మరింత సమాచారం తెలుసుకోండి: