టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రేక్షకుల మనసును దోచుకున్న చైల్డ్ ఆర్టిస్టులు చాలానే మంది ఉన్నారు. వారి అద్బుతమైన నటనతో మంచి ఫ్యాన్ బేస్ ని సంపాదించుకున్నారు. అయితే ఈ మధ్యకాలంలో చైల్డ్ ఆర్టిస్ట్ లుగా నటించిన వారి ఫోటోస్ తెగ వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా వారి పేర్లను, ఫోటోస్ ని షేర్ చేస్తున్నారు. అమ్మాయిల విషయానికి వస్తే.. చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన వాళ్లే ఇప్పుడు ముఖ్య పాత్రలో హీరోయిన్ గా చాలా సినిమాలలో కనిపిస్తున్నారు. అలాగే అబ్బాయిలు కూడా చైల్డ్ ఆర్టిస్టులుగా చేసి.. ప్రస్తుతం స్టార్ హీరోలుగా ఉన్నారు. ఇక తాజాగా ఒక చైల్డ్ ఆర్టిస్ట్ ఫోటో నేటింటా చాలా వైరల్ అవుతుంది. అయితే ఆ ఫోటో ఎవరిది.. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరు అని ఆలోచిస్తున్నారా.

టాలీవుడ్ హీరో నితిన్ నటించిన జయం సినిమాలో ఈ అమ్మాయి కనిపించింది. ఈ సినిమా అప్పట్లో మంచి హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ చిన్నారి తన నటనతో ప్రేక్షకుల మనసును దోచుకుంది. అయితే ఆ చిన్నారి ఎవరంటే యామిని శ్వేత. ఈమె జయం సినిమాలో హీరోయిన్ సదా చెల్లెలిగా నటించింది. యామిని శ్వేత సీరియల్ నటి జయలక్ష్మి కూతురు. చెల్లి పాత్రలలో నటించి ప్రేక్షకులను అలరించింది. ఈ సినిమాలో యామిని శ్వేత ఎంతో క్యూట్ గా ఉంటుంది. పెద్ద కళ్లతో, స్వీట్ స్మైల్ తో అభిమానులను సంపాదించుకుంది.

 
జయం సినిమాలో శ్వేత, సదా చెల్లెలి పాత్రలో చాలా బాగా యాక్ట్ చేసింది. జయం సినిమాతో మంచి హిట్ ని కూడా అందుకుంది.. జయం సినిమాలో నటించినప్పుడు యామిని శ్వేత వయసు పదిహేను ఏళ్లు ఉండేది. ఈ సినిమాతో పాటుగా ఉత్సహం, అనగనగా ఓ కుర్రాడు సినిమాలలో కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. ఈ చిన్నారి ఇప్పుడు పెద్దగా అయ్యి.. హీరోయిన్ రేంజ్ లో మారిపోయింది. ఈ అందాల భామ ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: