మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో కొన్ని సంవత్సరాల క్రితం ఆర్ ఆర్ ఆర్ అనే మూవీ రూపొంది అద్భుతమైన విజయాన్ని అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా 2022 వ సంవత్సరం మార్చి 25 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. ఈ సినిమా విడుదల అయ్యి ఈ సంవత్సరం మార్చి 25 వ తేదీతో మూడు సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఇక ఈ సినిమా విడుదల అయ్యి మూడు సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ల వివరాలను తెలుసుకుందాం.

టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ మూవీ కి నైజాం ఏరియాలో 111.85 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 51.04 కోట్లు , ఉత్తరాంధ్ర లో 36.40 కోట్లు , ఈస్ట్ లో 16.24 కోట్లు , వెస్ట్ లో 13.31 కోట్లు , గుంటూరు లో 18.21 కోట్లు , కృష్ణ లో 14.76 కోట్లు , నెల్లూరు లో 10.56 కోట్ల కనెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 272.31 కోట్ల షేర్ ... 415 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఇక ఈ మూవీ కి కర్ణాటక లో 83.40 కోట్లు , తమిళ నాడు లో 77.25 కోట్లు , కేరళ లో 24.25 కోట్లు , హిందీ లో 326 కోట్లు , రెస్ట్ ఆఫ్ ఇండియాలో 18.20 కోట్లు , ఓవర్సీస్ లో 208.30 కోట్ల కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ కి జపాన్ లో 145.50 కోట్ల కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ కి రీ రిలీజ్ లో భాగంగా 2.50 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 1300.40 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: