
కాగా రామ్ చరణ్ పుట్టినరోజు నేడు . ఈ సందర్భంగా అభిమానులు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో రచ్చ రంబోలా చేసిస్తున్నారు . ఇలాంటి మూమెంట్లోనే రామ్ చరణ్ కి సంబంధించిన మరికొన్ని ఇంట్రెస్టింగ్ వార్తలు ట్రెండ్ చేస్తున్నారు . రామ్ చరణ్ తన కెరీర్ లో ఎంతో మంది డైరెక్టర్స్ తో వర్క్ చేశారు . కొన్ని సినిమాలు హిట్ అయ్యాయి. కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అయితే ఒక డైరెక్టర్ తో మూడుసార్లు కమిట్ అయి మూడుసార్లు కూడా సినిమా రిజెక్ట్ అవ్వడం రాంచరణ్ లైఫ్ లోనే ఫస్ట్ టైం. ఇలా ఇది వరకు ఎప్పుడు కూడా చరణ్ లైఫ్ లో జరగలేదు.
ఆ డైరెక్టర్ మరెవరో కాదు "త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు". మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తే బాగుండు అనేది మెగా ఫాన్స్ కోరిక . ఎప్పటినుంచో ఆ కాంబో కోసం వెయిటింగ్ మెగా ఫ్యాన్స్. అయితే గతంలో మూడుసార్లు ఈ కాంబో సెట్ అయింది . కానీ కొన్ని కారణాల చేత సెట్ అయినట్లే సెట్ అయి లాస్ట్ మినిట్ లో క్యాన్సిల్ అయిపోయింది . ఈ కాంబో ఎప్పటికీ తెరకెక్కుతుందో అసలు తరకెక్కుతుందో..? లేదో..? అనేది కూడా బిగ్ డౌట్ గానే మిగిలిపోయింది..!