
టాలీవుడ్ గ్లామరస్ హీరోయిన్ పూజా హెగ్డే. ఈమె మోడల్, నటి. పూజా 2010 లో విశ్వసుందరి పోటీలకు భారతదేశం నుంచి ఎంపిక కోసం జరిగిన అందాల పోటీల్లో రెండో స్థానంలో నిలిచింది. ఆ తరువాత 2012 లో తమిళ సూపర్ హీరో సినిమా ముగమూడి అనే సినిమాలో అవకాశం వచ్చింది. ఈమె 2014 లో ముకుంద సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది. తరువాత ఒక లైలా కోసం సినిమాలో నటించింది. 2016 లో అశుతోష్ గోవారికర్ దర్శకత్వంలో వచ్చిన మొహంజదారో సినిమాలో నటించింది. ఆతర్వాత పూజ రాధేశ్యామ్, బ్యాచిలర్, దువ్వాడ జగన్నాధం సినిమాలలో కూడా నటించింది.
పూజా హెగ్డే సౌత్ లో చాలా సినిమాలు చేసినప్పటికీ మంచి ఫలితం రాలేదు. ఆమెకు వరుసగా ఫ్లాపులు రావడంతో మేకర్లు లైట్ తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. దీంతో నార్త్ మీదే ఎక్కువగా ఫోకస్ పెట్టింది ఈ బ్యూటీ. ఇప్పుడు ఈ అందాల భామ నార్త్ లో సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం పూజా రెట్రో మూవీలో సూర్యకి జంటగా నటిస్తుంది. అలాగే కూలీ, కాంచన 4 సినిమాలలో కూడా నటిస్తోంది. ఇక ఈ బుట్టబొమ్మ అందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక పూజా చిన్ననాటి ఫోటోస్ చూసిన నెటిజన్స్ తెగ కామెంట్స్ చేస్తున్నారు.