
మైత్రి మూవీస్ , సితార ఎంటర్టైన్మెంట్స్ మధ్య మంచి బాండింగ్ ఉంది ఇద్దరూ తమ సినిమా రిలీజ్ తేదీలు ఖరారు చేసే సమయంలోనే కూర్చుని మాట్లాడుకున్నారు కూడా .. అయితే ఒక సినిమా వాయిదా పడితే బాగుంటుందని కూడా అనుకున్నారు .. కానీ అది సాధ్యపడలేదు .. కనీసం ఒక్కరోజు గ్యాప్ అయన ఉంటే బాగుండేది .. కానీ అది కుదరలేదు .. మ్యాడ్ 2 సినిమాని మార్చ్ 29న రిలీజ్ చేద్దామని అనుకున్నారు కానీ 29న అమావాస్య వచ్చింది సెంటిమెంట్ పరంగా ఒక్కరోజు ముందుకు తీసుకు వచ్చేసారు .. మరోపక్క మైత్రి మూవీస్ కి కానీ .. నాగవంశీకి కానీ మరో సినిమా పోటీకి రావడం కొంత ఇబ్బందికరమే అంటున్నారు .. సోలో రిలీజ్ దొరక నందుకు ఇద్దరు బాధపడుతున్నారు .
ఇక నైజంలో రాబిన్ హుడ్ కి సరైన థియేటర్లు దొరకలేదన్న కామెంట్లు వస్తున్నాయి .. ఎందుకంటే నైజాంలో ఎక్కువ థియేటర్లో దిల్ రాజు చేతిలోనే ఉంటాయి .. ప్రధానంగా ఆయన లూసిఫర్ 2 ని తెలుగు లో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి వీలైనాన్ని ఎక్కువ ధియేటర్లు ఆ సినిమాకే ఇచ్చేశారు .. ప్రతి థియేటర్లోనూ సినిమా ఉండాలని లెక్క రాబిన్ హుడ్ .. మ్యాడ్ 2 సినిమాకు అలాంటిది లేదు .. కాకపోతే ఇది ఐపీఎల్ సీజన్ . అసలే క్రికెట్ మ్యాచ్లు సినిమాలకు పోటీలుగా ఉంటున్నాయి . ఇలాంటి సమయంలో మరో సినిమా పోటీకి దిగితే కాంపిటేషన్ మరింత రసవత్రంగా మారుతుంది .. అందుకే మైత్రి , సితార ఇంత టాప్ స్విచ్యువేషన్ ఎదుర్కొంటున్నాయి .. మిడ్రేంజ్ సినిమాల పరిస్థితి ఇలా ఉంటే .. ఒకేసారి రెండు పెద్ద సినిమాలు రిలీజ్ అయితే ఇంకెలా ఉండేదో ?