ఏ స్టార్ హీరో బర్త్డ డే వస్తుంది అని తెలిసిన ముందుగా ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసేది ఈగర్ గా వెయిట్ చేసేది ఆయన నెక్స్ట్ సినిమాల అప్డేట్ గురించి . చిన్నచితికా హీరోల గురించి అయితే పెద్దగా ఆలోచించరేమో కానీ పెద్ద పెద్ద హీరోల గురించి పాన్ ఇండియా స్టార్స్ గురించి అయితే నెల రోజులు ముందు నుంచి ఏ అప్డేట్ ఇస్తారా..? టీజర్ రిలీజ్ చేస్తారా..? ట్రైలర్ రిలీజ్ చేస్తారా ..? ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారా..?  అంటూ ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటారు ఫ్యాన్స్ . ప్రస్తుతం మెగా ఫ్యాన్స్ పరిస్థితి అలానే ఉంది . ఈరోజు రామ్ చరణ్ బర్త డే ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఆయనకు అభిమానులు - శ్రేయోభిలాషులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు .


అయితే మెగా ఫ్యాన్స్ మాత్రం ఆయన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు . ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాంచరణ్ ఒక సినిమాలో నటించబోతున్నాడు అంటూ టాక్ వినిపించింది. అంతే కాదు బర్త్డ డే సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ అప్డేట్ రిలీజ్ చేయబోతున్నారు ప్రశాంత్ నీల్ అంటూ టాక్ వైరల్ అయింది . కానీ ఇప్పుడు మాత్రం అసలు ఆ సినిమాకి సంబంధించి ఎటువంటి అప్డేట్ ఇవ్వదలుచుకోవడం లేదట  మూవీ టీం. ప్రజెంట్ రాంచరణ్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నాడు.



ఆ తర్వాత సుకుమార్ తో కమిట్ అయ్యాడు . ఈ రెండు సినిమాలు అయిపోయిన తర్వాత ప్రశాంత్ నీల్ తో అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి . కానీ ఇప్పుడు ట్రాక్లోకి బిగ్ బడా డైరెక్టర్ లోకేష్ కనగరాజు వచ్చినట్లు తెలుస్తుంది . ఆ కారణంగానే ప్రశాంత్ నీల్ సినిమాతో అఫీషియల్ అప్డేట్ ఇవ్వలేకపోతున్నారట . నిజానికి మెగా ఫ్యాన్స్ ప్రశాంత్ నీల్ - రామ్ చరణ్ కాంబో కోసం వెయిట్ చేస్తున్నారు . అలాంటిది పుట్టిన రోజు సందర్భంగా ఇలాంటి అప్డేట్ ఏది రాకపోవచ్చు అంటూ జనాలు మాట్లాడుకుంటున్న మూమెంట్ల మెగా ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు. ఇది నిజంగా రామ్ చరణ్ బర్త డే వేళ మెగా ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్ అని అంటున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: