మరికొన్ని గంటల్లో రాబిన్ హుడ్, మ్యాడ్2 సినిమాలు థియేటర్లలో విడుదల కానున్నాయి. ఈ రెండు సినిమాల ట్రైలర్లు ఇప్పటికే విడుదలయ్యాయి. రాబిన్ హుడ్ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రాగా మ్యాడ్2 ట్రైలర్ మాత్రం ఆశించిన స్థాయిలో లేదు. మ్యాడ్2 మూవీ ట్రైలర్ ప్రేక్షకుల అంచనాలను తగ్గించింది. టాక్ మాత్రమే సినిమా రేంజ్ ను మారుస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
 
మ్యాడ్2 రికార్డ్ స్థాయి స్క్రీన్లలో విడుదలవుతుండగా రాబిన్ హుడ్ మాత్రం ఒకింత పరిమితంగా థియేటర్లలో రిలీజవుతోంది. అయితే ఈ సినిమాలకు టాక్ కీలకం కానుందని చెప్పడంలో సందేహం అయితే అవసరం లేదు. ఈ రెండు సినిమాలు కలెక్షన్ల విషయంలో ఏ స్థాయిలో రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. మ్యాడ్2 సినిమా కోసం యూత్ ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 
రాబిన్ హుడ్ సక్సెస్ సాధించడం నితిన్ కు కీలకం కాగా మ్యాడ్ స్క్వేర్ మూవీ సక్సెస్ సాధించడం సితార బ్యానర్ కు కీలకం కానుంది. సితార బ్యానర్ సినిమాలు వరుసగా హిట్ అవుతున్నా ఇతర సినిమాలతో పోటీ వల్ల ఈ బ్యానర్ కు తీవ్రస్థాయిలో నష్టం కలుగుతోంది. రాబిన్ హుడ్ కలెక్షన్ల విషయంలో సైతం సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు.
 
మైత్రీ మూవీ మేకర్స్, సితార నిర్మాతలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతుండటం గమనార్హం. రెండు బ్యానర్ల సక్సెస్ రేట్ ఒకింత ఎక్కువేననే సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలు ఒకింత భారీ బడ్జెట్ తోనే తెరకెక్కాయి. ఈ సినిమాలు కలెక్షన్ల విషయంలో సైతం రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. టాలీవుడ్ టాప్ బ్యానర్ల రేంజ్ మరింత పెరగాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో  ఉగాది పండుగ సందర్భంగా ఎక్కువ సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతుండటంతో థియేటర్లు కళకళలాడుతున్నాయి.


 


మరింత సమాచారం తెలుసుకోండి: