- ( రాయ‌ల‌సీమ - ఇండియా హెరాల్డ్ ) . . .

కడప జడ్పీ చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకోవటానికి టిడిపికి ఇప్పుడే మంచి అవకాశం. అయితే ఆ పార్టీ ఆశించిన స్థాయిలో వైసీపీ నుంచి ఫిరాయింపులు లేవు. దీంతో అధికారంలో ఉండి పోటీ చేసి ఓడిపోయాం అనే అపవాదు కంటే పోటీ నుంచి తప్పుకోవడమే మంచిదని ఆ పార్టీ అనుకుంది. అయితే తాజాగా టిడిపి వ్యూహం మార్చి వైసిపికి పెద్ద ఝుల‌క్‌ ఇచ్చింది. కడప అంటే వైయస్సార్ కుటుంబానికి రాజకీయ అడ్డ అనే పేరు ఉంది. పులివెందుల అసెంబ్లీ తో పాటు క‌డ‌ప పార్ల‌మెంటు స్థానాన్ని ఇది ఎప్పుడూ కోల్పోలేదు. ఇక్కడ టిడిపికి కేవలం ఆరుగురు జడ్పిటిసి సభ్యులు మాత్రమే ఉన్నారు. వైసీపీకి ఏకంగా 42 మంది జడ్పిటిసి సభ్యులు మద్దతు ఉండడంతో అధికార కోసం పన్నాగాలు పారలేదు. అయితే రాజీనామా తో ఒక స్థానం జడ్పిటిసి సభ్యుడు మృతితో మరో స్థానం ఖాళీగా ఉన్నాయి. ఖాళీగా పులివెందుల - ఒంటిమిట్ట జడ్పిటిసి స్థానాలు ఉండడంతో టిడిపి మనసులో మెరుపులాంటి ఆలోచన కలిగింది.


రెండు స్థానాలకు ఎన్నికలు జరగకుండా జడ్పీ చైర్మన్ కు ఎన్నిక జరిగితే తాను నష్టపోతానని బద్వేల్‌ నియోజకవర్గంలోని గోకవరం జడ్పిటిసి సభ్యుడు జయరాం రెడ్డి హైకోర్టు ను ఆశ్రయించారు. 27న జడ్పీ చైర్మన్ ఎన్నిక జరగాలని ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చిందని .. తాను బరిలో నిరవాలని అనుకుంటున్నానని అయితే రెండు స్థానాలు ఖాళీగా ఉన్న నేపథ్యంలో ఎన్నిక జరపటం సరైనది కాదు అంటూ ఆయన హైకోర్టులో పిటిషన్ చేశారు. దీంతో కడప జడ్పీ చైర్మన్ స్థానాన్ని నిలుపుకున్నామని సంబరపడుతున్న వైసిపికి ఇది గట్టి షాక్ అని చెప్పాలి. జడ్పిటిసి లను ప్ర‌లోభ పెట్టే క్రమంలో కోర్టుకు ఎక్కటం ద్వారా సమయం లభిస్తుందన్నది టిడిపి ప్లాన్ గా తెలుస్తోంది. అయితే వైసిపి సభ్యులను టిడిపి వైపు తిప్పుకోవడం ప్రస్తుతానికి సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. ఒకవేళ కోర్టులో టిడిపికి అనుకూలంగా నిర్ణయం వస్తే ఇదే కారణంతో వైసిపి రాష్ట్రమంతా వెళుతుందని ఆ పార్టీ నాయకులు అంటున్నా రు. ఏది ఏమైనా కడపలో ప్రస్తుతానికి అయితే వైసిపి కి తెలుగుదేశం పార్టీకి కాస్త గట్టి షాక్‌ ఇచ్చిందని చెప్పాలి. మరి ఇది ఎంతవరకు కంటిన్యూ అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: