మెగా హీరో రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మెగా వారసుడిగా సినిమాల్లోకి పరిచయమైన రామ్ చరణ్ తనదైన నటనతో ప్రేక్షకులలో మంచి గుర్తింపును అందుకున్నాడు. తన సినిమాల ద్వారా ప్రేక్షకుల మనసులను దోచుకున్నాడు. రామ్ చరణ్ నటనకు గాను ఎన్నో అవార్డులను సైతం అందుకున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ హీరోగా ఎదిగిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అనంతరం రామ్ చరణ్ వరసగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తున్నారు. 


రీసెంట్ గా రాంచరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా అనంతరం రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం ఆర్సి 16. ఈ సినిమాకు బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, వీరిద్దరి కాంబినేషన్లో ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఇదిలా ఉండగా..... ఈరోజు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఆర్ సి 16 సినిమా నుంచి అప్డేట్ వచ్చింది. ఆర్సి 16 అనే సినిమాకు గాను "పెద్ది" అనే టైటిల్ ను ఖరారు చేశారు. 

ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ ను చిత్ర బృందం రిలీజ్ చేశారు. కాగా, పెద్ది సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా ఈ చిన్నది దేవర సినిమాతో మంచి సక్సెస్ అందుకుంది. అనంతరం రామ్ చరణ్ తో కలిసి పెద్ది సినిమాలో చేస్తోంది.


ఈ సినిమాలో జాన్వి కపూర్ నటన చాలా అద్భుతంగా ఉంటుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. కాగా, ఈ సినిమా షూటింగ్ త్వరలోనే పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ సినిమా కోసం రామ్ చరణ్, జాన్వి కపూర్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా మంచి సక్సెస్ అందుకోవాలని కోరుకుంటున్నాను.

మరింత సమాచారం తెలుసుకోండి: