- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ )


మ‌రి కొద్ది రోజుల గ్యాప్ లో బాలీవుడ్ లో ఇద్ద‌రు సౌత్ ఇండియ‌న్ ద‌ర్శ‌కులు తెర‌కెక్కించిన సినిమా లు రెండు రిలీజ్ అవుతున్నాయి. ఈ రెండు సినిమా ల‌లో హీరో బాలీవుడ్ స్టార్ .. సీనియ‌ర్ హీరోలు. కానీ రెండు సినిమాలు తెర‌కెక్కించిన ద‌ర్శ‌కులు మాత్రం మ‌న సౌత్ ఇండియ‌న్ వాళ్లు కావ‌డం విశేషం. ఇక రెండు సినిమాల విస‌యానికి వ‌స్తే వాటిలో మొదటిది సికందర్. సల్మాన్ ఖాన్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో క‌న్న‌డ ముద్దుగుమ్మ‌ రష్మిక మందన్న హీరోయిన్. సినిమా బుకింగ్స్ బాగానే ఉన్నప్పటికీ జవాన్, పఠాన్ తరహాలో మాస్ హిస్టీరియా కనిపించడం లేదని బయ్యర్లు ఆందోళన లో ఉన్న మాట వాస్త‌వం. ఇక ట్రైల‌ర్ తో పాటు పాట‌లు .. ప్ర‌మోష‌న‌ల్ కంటెంట్ ఆశించిన స్థాయిలో అయితే లేదనే అంటున్నారు. ఇక ఈ నెల 30న వ‌స్తోన్న భాయ్ ఏదైనా అద్భుతం జ‌రిగి తేనే గ‌ట్టెక్కుతాడు. ఎంత మాస్ అయినా తేడా కొడితే స‌ల్మాన్ సినిమా అని చూడ‌కుండా ప్రేక్ష‌కులు తిర‌స్క‌రిస్తున్నారు. గ‌తంలో రాధే , రేస్ 3 , ట్యూబ్ లైట్ లాంటి వాటితో అది ఫ్రూవ్ అయ్యింది.


ఇక ఏఆర్ . మురుగదాస్ డైరెక్షన్ ఓల్డ్ స్కూల్ లో ఉందనే నెగటివ్ ఫీడ్ బ్యాక్ బాగా వ‌చ్చేసింది. ఇక రెండోది ఏప్రిల్ 10న వ‌స్తోన్న జాట్‌. బాలీవుడ్ సీనియ‌ర్ హీరో సన్నీ డియోల్ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించాయి. టీజర్ చిన్నదే అయినా ట్రేడ్, మాస్ ని బాగా ఆక‌ట్టుకుంద‌ని. . సికంద‌ర్ తో పోలిస్తే ఈ సినిమాకు బిజినెస్ ఎంక్వైరీలు బాగా జ‌రుగుతున్నాయ‌ని అంటున్నారు. ఇక జాట్ అస‌లైన ట్రైల‌ర్ రాలేదు. క‌థ రొటీన్ గా అనిపిస్తున్నా ... యాక్షన్ విజువల్స్ , సన్నీని ప్రెజెంట్ చేసిన తీరు , మ‌న టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్ ఎస్‌. థ‌మన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అంచనాలు పెంచుతున్నాయి. రమ్యకృష్ణ, జగపతి బాబు, రెజీనా లాంటి తెలుగు క్యాస్టింగ్ తీసుకోవడం కూడా సినిమా కు తెలుగులోనూ .. అటు త‌మిళంలోనూ కాస్త ప్రెష్ నెస్ తీసుకువ‌చ్చింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఎలా చూసుకున్నా ఇద్ద‌రు సౌత్ ద‌ర్శ‌కుల లో మురుగ‌దాస్ మీద మ‌లినేని గోపీచంద్ పై చేయి అయితే సాధించాడు. మ‌రి రేపు రెండు సినిమాలు రిలీజ్ అయ్యాక ఎవ‌రిది పై చేయి అవుతుందో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: