నటీనటులను మనం ఎలా అయితే ఇష్టపడతామో అలాగే ఆ నటినటులు కూడా వేరే వారిని ఇష్టపడుతుంటారు. అలా ఎంతోమంది స్టార్ హీరో హీరోయిన్లు తమకు వేరే హీరో హీరోయిన్లు ఇష్టం అని చెప్పిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అయితే తాజాగా రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఆయన మనసు పడ్డ హీరోయిన్ ఎవరో ఇప్పుడు చూద్దాం.. మెగాస్టార్ చిరంజీవి సురేఖ దంపతులకు 1985 మార్చి 27న రామ్ చరణ్ జన్మించారు. ఈయన అసలు పేరు రామ్ చరణ్ తేజ.. అయితే అలాంటి రామ్ చరణ్ సినిమాల్లోకి వచ్చి అంచలంచెలుగా ఎదిగి తండ్రికి తగ్గ కొడుకుగా పేరు సంపాదించుకున్నారు. ఇక ఆర్ఆర్ఆర్ మూవీ తో గ్లోబల్ ఇమేజ్ సంపాదించిన ఈ హీరో ఈ ఏడాది విడుదలైన గేమ్ ఛేంజర్ మూవీ తో భారీ డిజాస్టర్ ని ఎదుర్కొన్నారు. ఇక డిజాస్టర్ సినిమా ను తలుచుకొని బాధపడితే ఒరిగేది ఏమీ లేదు.

అందుకే హీరో హీరోయిన్లు హిట్ వచ్చినా ఫ్లాప్ వచ్చిన సైలెంట్ గా కూర్చొకుండా నెక్స్ట్ సినిమాలపై దృష్టి సారిస్తారు. అలా రామ్ చరణ్ కూడా బుచ్చిబాబు డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నారు. ఇక ఈ సినిమాకి పెద్ది అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు.అలాగే సుకుమార్ డైరెక్షన్లో కూడా రామ్ చరణ్ మరో సినిమా చేస్తున్నారు. ఈ విషయం పక్కన పెడితే..రామ్ చరణ్ కి ఇష్టమైన ఒక హీరోయిన్ ఉందట. ఆ హీరోయిన్ ఎవరో కాదు సమంత.. నాగచైతన్య మాజీ భార్య స్టార్ హీరోయిన్ అయినటువంటి సమంత అంటే రామ్ చరణ్ కి ఎంతో ఇష్టమట.ఇక రామ్ చరణ్ సమంత కాంబినేషన్లో రంగస్థలం సినిమా కూడా వచ్చింది. ఇక రామ్ చరణ్ కి సమంత యాక్టింగ్ అంటే చెప్పలేనంత ఇష్టమట. అందుకే సమంత కి నేను వీరాభిమానిని అయిపోయాను అంటూ రామ్ చరణ్ ఓ  ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు.

అలాగే తన అభిమాన హీరో కోలీవుడ్ నటుడు సూర్య అని చెప్పడం విశేషం. అలాగే అట్టర్ ప్లాప్ అయినా ఆరెంజ్ మూవీ అంటే తనకు చాలా ఇష్టమని రామ్ చరణ్ తెలియజేశారు. అంతేకాకుండా తనకు బాగా ఇష్టమైన సినిమాల్లో మగధీర తన ల్యాండ్ మార్క్ అని,ఈ సినిమా తర్వాత ఆరెంజ్,రంగస్థలం వంటి రెండు సినిమాలు కూడా నా కెరియర్ లో ది బెస్ట్ అంటూ రామ్ చరణ్ చెప్పుకోచ్చారు.అయితే ఈ విషయాలన్నీ రామ్ చరణ్ ఓ నేషనల్ మీడియా కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు ప్రస్తుతం రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి

మరింత సమాచారం తెలుసుకోండి: