- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ )


న‌ట‌సింహం నంద‌మూరి బాలకృష్ణ కెరీర్ లోనే కాదు టాలీవుడ్ మొదటి సైన్స్ ఫిక్షన్ సినిమా గా మంచి గుర్తింపు .. ప్ర‌త్యేక తెచ్చుకున్న సినిమా ఆదిత్య 369. ఈ సినిమా ను వ‌చ్చే ఏప్రిల్ 4న రీ రిలీజ్ చేయ‌బోతున్న‌ట్టు ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ముందు 11న రీ రిలీజ్ అనుకున్నా.. త‌ర్వాత డేట్ 4కు మార్చారు. ఎప్పుడో 1991లో రిలీజైన ఈ క్లాసిక్ ని టీవీ ల‌లో .. యూట్యూబ్ లో బోలెడుసార్లు ప్రేక్షకులు చూసినా ఈ త‌రం జ‌న‌రేష‌న్ వాళ్లు పెద్ద తెర‌పై చేసి అనుభూతి పొందే కంటెంట్ ఈ సినిమా లో చాలానే ఉంది. అందుకే నిర్మాత శివ‌లెంక కృష్ణ ప్ర‌సాద్  ఈ పాత సినిమాను 4కెలో కన్వర్ట్ చేసి సిద్ధం చేస్తున్నారు. ఇది అంత తేలికైన విషయం కాదు. అయితే ఈ సినిమా ను రీ రిలీజ్ చేయ‌డం వెన‌క చాలా క‌ష్టం ఉంద‌ని నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ గారు చెప్పారు.


ఆదిత్య 369 ఇప్పటి తరానికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఆయ‌న గ‌త ఆరేడేళ్లు గా ఎన్నో ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ట‌. ఈ క్ర‌మంలో నెగ‌టివ్ అందుబాటులో లేదు. పాజిటివ్ రీల్స్ డ్యామేజ్ అయిపోయాయ‌ట‌. ఇలా వెతుకుతున్న క్ర‌మంలో విజయవాడ శాంతి పిక్చర్స్ అధినేత వెంకటేశ్వరరావు నుంచి తన దగ్గర మంచి ప్రింట్ ఉందని ఫోన్ చేశార‌ట‌. అలా ప్ర‌సాద్ దానిని తీసుకుని నేరుగా చెన్నైలో ఉన్న ప్రసాద్ కార్పొరేషన్ కి ఇచ్చి పనులు మొదలుపెట్టారు. అలా ఆదిత్య 369 ప్రింట్ ను 4K కన్వర్షన్ చేయించ‌డానికి అయిదారు నెలలు పట్టింది.


ఫైనల్ కాపీ సిద్ధమయ్యాక కృష్ణప్రసాద్ వెంటనే బాలకృష్ణకు ఫోన్ చేయ‌డం.. ఇద్ద‌రూ క‌లిసి కాపీ చూసుకుని శాటిస్ పై అవ్వ‌డం జ‌రిగాయ‌ట‌. ఇలా ఈ ప్రింట్ రావ‌డానికి తాము ఇంత క‌ష్ట‌ప‌డ్డామ‌ని నిర్మాత చెప్పారు. ఇక పాత సినిమా నెగటివ్ లు సకాలంలో భద్రపర్చుకోకపోతే ఏమవుతుందో ఇంతకన్నా ఎగ్జాంపుల్ అవ‌స‌రం లేదు. ఇక గ‌తంలో శివ రీ రిలీజ్ చేసిన‌ప్పుడు కూడా త‌న‌కు ఇలాంటి ఇబ్బందే ఎదురైంద‌ని నాగార్జున స్వ‌యంగా చెప్పారు. ఏదేమైనా మ‌ళ్లీ ఇన్ని ఇబ్బందులు దాటుకుని ఈ టాలీవుడ్ క‌ల్ట్ క్లాసిక్ మూవీ  5.1 సౌండ్ మిక్స్ తో ఏప్రిల్ 4 మళ్ళీ థియేటర్లలో సందడి చేయబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: