రష్మిక మందన్నా సల్మాన్ ఖాన్ ఇద్దరు సికిందర్ మూవీ లో నటించిన సంగతి మనకు తెలిసిందే.ఈ సినిమాలో నటుడు సత్యరాజ్ విలన్ గా కాజల్ అగర్వాల్ కీలకపాత్రలో నటిస్తుంది. అయితే సికిందర్ మూవీ మార్చి 30న విడుదల కాబోతుండడంతో ఈ సినిమాకి సంబంధించి  ట్రైలర్ రిలీజ్ ఈవెంట్, ప్రీ రిలీజ్ ఈవెంట్లు నిర్వహించారు చిత్ర యూనిట్. ఈ నేపథ్యంలోనే స్టేజ్ మీద రష్మిక సల్మాన్ ఖాన్ ఒకరిని ఒకరు పొగుడుకోవడంతో పాటు ఎన్నో ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టారు.అలా రష్మిక డెడికేషన్ కి నేను ఫిదా అయ్యా అని ఆమె ఒకేసారి రెండు షిఫ్టుల్లో పనిచేసింది అని సల్మాన్ చెప్పుకొచ్చారు. అలాగే సల్మాన్ ఖాన్ యాక్టింగ్ చూసి చాలా నేర్చుకోవచ్చని,ఆయన అంత పెద్ద హీరో అయినా కూడా పొగరుగా ప్రవర్తించారంటూ రష్మిక కూడా చెప్పుకొచ్చింది.

అయితే వీరిద్దరు మాట్లాడుకున్న విషయం కాస్త పక్కన పెడితే తాజాగా సల్మాన్ ఖాన్ రష్మిక మందన్నా ఇద్దరు స్టేజ్ మీదే లిప్ కిస్ పెట్టుకున్నట్టు సోషల్ మీడియాలో ఒక వీడియో, ఫోటోలు వైరల్ గా మారాయి.. అయితే నిజంగానే వీరిద్దరూ లిప్ కిస్ పెట్టుకున్నారా..అంత ఘాటు లిప్ లాక్ ఏంటి.. సినిమాలో అంటే ఏదో షూటింగ్లో భాగంగా అనుకోవచ్చు. కానీ స్టేజ్ మీద అలా చేశారేంటి అని ఈ వీడియోలు ఫోటోలు చూసిన చాలామంది నెటజన్లు అవాక్కైపోతున్నారు.అయితే సల్మాన్ రష్మిక ఇద్దరూ ఘాటు లిప్ లాక్ పెట్టుకున్న ఫోటో వీడియో నిజమే అనుకుంటే పప్పులో కాలేసినట్టే.ఎందుకంటే అది ఫేక్ ఫోటోలు. రష్మిక సల్మాన్ ఖాన్ ఇద్దరు డీప్ ఫేక్ కి గురయ్యారు. 

వీరిద్దరూ స్టేజ్ మీద లిప్ లాక్ పెట్టుకున్నట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో డీప్ ఫేక్ వీడియో అని క్లారిటీ వచ్చేసింది. ఓ వ్యక్తి సోషల్ మీడియా ఖాతాలో సల్మాన్ రష్మిక ఇద్దరూ 13 సెకండు పాటు ఘాటు లిప్ లాక్ పెట్టుకున్న వీడియో షేర్ చేశారు.అయితే ఈ వీడియో షేర్ చేసిన క్షణాల్లోనే వైరల్ అవ్వడంతో ఇది సోషల్ మీడియాలో వివాదాస్పదంగా మారింది. అయితే ఇది డీప్ ఫేక్ వీడియో అని తేల్చేశారు. ఏఐ ఇమేజ్ అని తేల్చేశారు. ఇక ఈ మధ్యకాలంలో చాలా మంది సెలబ్రేటీస్ కి సంబంధించి ఏఐ వీడియోలు డీప్ ఫేక్ వీడియోలు ఫోటోలు ఎన్నో మనం చూసాం. అలా రష్మిక సల్మాన్ ఖాన్ కి సంబంధించిన ఫోటోస్, వీడియోస్ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: