
ఈయన అష్టచెమ్మ సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయ్యి.. ఆతర్వాత ఈగ, జెర్సీ, మిడిల్ క్లాస్ అబ్బాయి, శ్యామ్ సింగ్ రాయ్, కృష్ణ అర్జున యుద్ధం, పిల్ల జమీందార్, అలా మొదలైంది, హాయ్ నాన్న, దసరా సినిమాలతో ఫుల్ పాపులర్ అయిపోయాడు. ప్రస్తుతం నాని 'ది ప్యారడైజ్' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. ఈ మూవీని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో దసరా సినిమా వచ్చింది. ఇక దీంతో ది ప్యారడైజ్ సినిమాపై ప్రేక్షకులకు అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమాలో సోనాలి కులకర్ణి ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా ఎస్.ఎల్.వి సినిమాస్ పతాకంపై రూపొందుతుంది. ది ప్యారడైజ్ మూవీకి అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
ఈ సినిమా సికింద్రాబాద్ నేపథ్యంలో సాగే కథ అని సమాచారం. ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. కానీ ఇప్పటికీ ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనేది ప్రకటించలేదు. అయితే తాజాగా 'వన్ ఇయర్ టు గో... ఇండియన్ సినిమా విట్నెస్ ది మ్యాడ్నెస్' అంటూ కొత్త పోస్టర్ ని మూవీ మేకర్స్ విడుదల చేశారు. ఇక ఈ పోస్టర్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. ఈ సినిమా తెలుగు, ఇంగ్లీష్, స్పానిష్ సహ 8 భాషల్లో విడుదల అవ్వనుంది. నాని యాక్షన్ రోల్ లో రాబోయే ఈ సినిమా మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోనుందని మూవీ మేకర్స్ స్పష్టం చేశారు.