తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు వ్యాంప్ పాత్రలు అంటే  చాలామందికి గుర్తుకు వచ్చేది అలనాటి నటి  సిల్క్ స్మిత. ఆ తర్వాత  అంతటి పేరు తెచ్చుకున్న నటి  జయలలిత.. బోరింగ్ పాప అనే చిత్రం ద్వారా ఎంతో పేరు తెచ్చుకున్న ఈమె బోల్డ్ పాత్రల నుంచి మెల్లిమెల్లిగా  అక్క, అత్తా, తల్లి, వదిన, ఇలా పాత్రలు చేసుకుంటూ ఇండస్ట్రీలో  పాతుకు పోయింది.. అలాంటి జయలలిత  యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు  రామానాయుడుతో ఎక్కువ చనువు ఉండేదట. అంతేకాదు రామానాయుడుకు జయలలిత అంటే కూడా చాలా ఇష్టమట. ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో ఆమె బయట పెట్టింది..

90s లో  జయలలిత చాలా ఫేమస్ నటి. కేవలం తెలుగు ఇండస్ట్రీలో కాకుండా తమిళ, మలయాల ఇండస్ట్రీలో కూడా ఈమెకు పేరు వచ్చింది..అలాంటి ఈమె తన జీవితంలో కొన్ని మధురానుభూతులను ఆ ఇంటర్వ్యూలో బయట పెట్టింది. నేను యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు తనికెళ్ల భరణి, రమప్రభ వంటి సీనియర్ నటీనటులంతా నాతో బాగా మాట్లాడేవారని చెప్పుకొచ్చింది. మరి ముఖ్యంగా రామానాయుడు గారితో నాకు చాలా అనుబంధం ఉందని, ఆయన తరచూ ఫోన్ చేసి నన్ను ఇంటికి వచ్చి వెళ్ళు అని చెప్పేవారని చెప్పుకొచ్చింది. నేను ఇంటికి వెళ్తే ఆయనకు మనశ్శాంతి ఉండేదని,  అలా తరచూ నన్ను కాసేపు నాతో మాట్లాడి వెళ్ళు అంటూ ఫోన్ చేసేవారని చెప్పుకొచ్చింది.

 ఈ విధంగా జయలలితకు మరియు రామానాయుడుకు మధ్య  అప్పట్లో మంచి అనుబంధం ఉండేదాని సోషల్ మీడియాలో అనేక వార్తలు వినిపించాయి.ఇక సీనియర్ నటి జయలలిత కేవలం దగ్గుబాటి రామానాయుడు మీద మాత్రమే కాదు అప్పట్లో ముకేశ్ అంబానీ తండ్రి ధీరుభాయ్ అంబానీ కూడా తనపై ఇష్టం పెంచుకున్నారని,తన మీద ప్రేమతో  ముంబైలో ఓ ఖరీదైన అపార్ట్మెంట్ కూడా రాసిచ్చారని ఓ ఇంటర్వ్యూలో చెప్పిన సంగతి మనకు తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: