
మరీ ముఖ్యంగా రామ్ చరణ్ తన బర్త్డ డే నాడు ఏం చేస్తాడు అనే విషయం ఇంట్రెస్టింగ్ గా మారింది . సాధారణంగా కామన్ పీపుల్స్ లా స్టార్ సెలబ్రిటీస్ ఎవరు చేయరు అనేది జనాలు అభిప్రాయం . వాళ్లకి డబ్బు ఉంటుంది చిటికేస్తే కొండమీద కోతిని అయినా తెచ్చుకునే సత్తా ఉంటుంది . అలాంటి స్టార్ స్టేటస్ ఉన్నవాళ్లు పుట్టినరోజు నాడు అన్ని ఫారిన్ కల్చర్ పద్ధతులను అలవాటు చేసుకుంటారు అనేది జనాల ఒపీనియన్ . కానీ రామ్ చరణ్ మాత్రం అలా కాదు చాలా ట్రెడిషనల్ పద్ధతిలోనే ఆయన పుట్టినరోజు జరుపుకుంటారట .
మరీ ముఖ్యంగా ఏ రోజు సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సరే పుట్టిన రోజు నాడు మాత్రం ఆయన పూర్తి టైం ని ఫ్యామిలీకి కేటాయిస్తారట. అంతేకాదు పుట్టినరోజు నాడు ఆయన కచ్చితంగా ఆయన అనాధ శరణాలయం లోని పిల్లలకు ఫుడ్ అనేది కచ్చితంగా డొనేట్ చేస్తారట . మరీ ముఖ్యంగా రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఆయన భార్య ఉపాసన ఆయన తల్లి సురేఖ పేద ప్రజలకు ఆకలితో అల్లాడిపోతున్న పిల్లలకు కడుపునిండా భోజనం పెట్టే విధంగా ప్రతి పుట్టినరోజుకు చేస్తూనే ఉంటారు . దానికి రాంచరణ్ కూడా సపోర్ట్ చేస్తూనే ఉంటారు . రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా అదేవిధంగా చేయాలి అని కోరుకుంటూ ఉంటారు . రామ్ చరణ్ బర్త్ డే చాలా చాలా స్పెషల్గా ట్రీట్ చేస్తూ ఉంటారు మెగా ఫాన్స్..!