
మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ తో సినిమా చేయడానికి ఎంతటి వారైనా ఆసక్తి చూపిస్తారు. ముఖ్యంగా షారుఖ్ ఖాన్, ఐశ్వర్యరాయ్ కాంబినేషన్లో వచ్చిన సినిమాలు ఇప్పటికీ ఎవర్గ్రీన్ అనే చెప్పాలి. కానీ అంతలా పేరు తెచ్చుకున్న వీరు ఉన్నట్టుండి కలిసి నటించడం మానేశారు. దీనికి కారణం ఏమిటి? అసలు ఏం జరిగింది? అనే విషయాలు వైరల్ అవ్వగా ..తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న షారుఖ్ ఖాన్ ఈ విషయాలపై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు.
ఇకపోతే షారుక్ ఖాన్ ఇదే విషయంపై మాట్లాడుతూ.. మా మొదటి సినిమా జోష్. ఇందులో చెల్లి పాత్ర చేసింది. రెండో సినిమా దేవదాస్. అందులో ఐశ్వర్య నన్ను వదిలి వెళ్ళిపోయింది. ఇక మూడవ సినిమా మొహబ్బతేం. ఇందులో దెయ్యం పాత్ర చేసింది. ఇక నేను ఆమెతో ఆన్ స్క్రీన్ లో రొమాన్స్ చేసే అవకాశమే లభించలేదు. ఈ విషయం నాకు మరింత బాధ కలిగింది. అందుకే మాకు తెలియకుండానే మా ఇద్దరి కాంబినేషన్లో సినిమాలు ఆగిపోయాయి. పైగా మా కాంబినేషన్లో సినిమాలు చేయడానికి ఎవరు కూడా ముందుకు రావడం లేదు. దాంతో అనుకోకుండానే గ్యాప్ ఏర్పడింది అంటూ క్లారిటీ ఇచ్చారు షారుఖ్ ఖాన్.
ఇకపోతే ఐశ్వర్యరాయ్, షారుఖ్ ఖాన్ కలిసి సినిమాలు చేయకపోయినా అప్పుడప్పుడు పలు కార్యక్రమాలలో పాల్గొంటూనే సినిమా ప్రీమియర్ షోలలో కూడా కలుస్తూ ఉండేవారు. ఇక పిల్లలు పుట్టిన తర్వాత వీళ్ళిద్దరూ కలిసే విధానం కూడా చాలా మారిపోయింది. ఇప్పుడు చాలా ఫన్నీగా కలుసుకుంటున్నారని చెప్పవచ్చు. ఇక ఇన్ని రోజులు సినిమా సెట్స్ పైన, సినిమా పనుల మీద కలిసే వీళ్ళు ఇప్పుడు పిల్లల్ని స్కూల్ లో దింపడానికి వచ్చినప్పుడు మాత్రమే కలుస్తున్నారట. ఏదేమైనా పిల్లల్ని స్కూల్ కి డ్రాప్ చేసినప్పుడు ఎదురు పడుతున్నట్టు నవ్వుతూ సరదాగా కామెంట్ చేశారు షారుక్ ఖాన్ . ఏది ఏమైనా షారుఖ్ ఖాన్- ఐశ్వర్యరాయ్ కాంబోలో సినిమాలు రాకపోవడంతో అభిమానులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.