డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన లేటెస్ట్ సినిమాల్లో దర్శకుడు హరీష్ శంకర్ తో చేస్తున్న సాలిడ్ మాస్ యాక్షన్ మూవీ “ ఉస్తాద్ భగత్ సింగ్ ” కూడా ఒకటి .. అయితే ఇది పవన్ కళ్యాణ్ ఇచ్చిన కొన్ని రోజుల వ్యవధి లోనే సాలిడ్ కంటెంట్ ని తెరకెక్కించి ఆశ్చర్యపరిచారు మేకర్స్ .. దీంతో ఈ సినిమా పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి .. అయితే ఈ సినిమా పై నిర్మాత రవిశంకర్ చేసిన‌ కామెంట్స్ ఇప్పుడు ఎంతో వైరల్ గా మారాయి ..


పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ ముందు పాన్ ఇండియ హీరోలు , సినిమాలు కూడా పనికిరావు అన్నట్టు ఆయన మాట్లాడాడు .. నితిన్ రాబిన్‌హూడ్‌ ప్రమోషన్స్ లో భాగంగా ఆయన చేసిన ఈ తాజా కామెంట్స్ ఇప్పుడు ఎంతో వైరల్ గా మారాయి .. పవన్ డేట్స్ కోసం తాము ఎంతో ఆసక్తి గా ఎదురు చూస్తున్నామని వచ్చే ఏడాది ఎలాగైనా ఈ సినిమా రిలీజ్ చేస్తామని పవన్ అభిమానుల కి ఊహించని కిక్ అందిస్తామ ని ఆయన చెప్పకు వచ్చారు .. అయితే దీంతో ఈ సాలిడ్ స్టేట్మెంట్ ఇప్పుడు వైరల్ గా మారింది ..


 ప్రస్తుతం పవన్ చేస్తున్న హరిహర వీరమల్లు , ఓజి సినిమాలకే సరిగా టైం కేటాయించలేకపోతున్నాడు పవన్ .. అలాంటిది ఉస్తాద్ భగత్ సింగ్ పై అందరూ ఆశలు వదిలేసుకున్నారు .. ఈ సినిమా లేదని అంత అనుకుంటున్న సమయంలో నిర్మాత రవిశంకర్ చేసిన కామెంట్లు ఇప్పుడు పవన్ అభిమానుల్లో మరింత కొత్త  జోష్ ను పెంచుతున్నాయి .. ఇక మరి రవిశంకర్ చెప్పినట్లు పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ లో నటించడాని కి డేట్స్ ఇస్తారా.  లేక ఈ సినిమా ను అలాగే మధ్యలో ఆపేస్తారా అనేది మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది .

మరింత సమాచారం తెలుసుకోండి: