మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి కీర్తి సురేష్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె తమిళ సినిమాలు ద్వారా కెరీర్ ను మొదలు పెట్టి కోలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత తెలుగు సినీ పరిశ్రమ లోకి ఎంట్రీ ఇచ్చింది. కీర్తి సురేష్ "నేను శైలజ" అనే సినిమాతో తెలుగు పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి , మొదటి సినిమాతోనే మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఆ తర్వాత కూడా ఈమె మంచి విజయాలను అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది.

ప్రస్తుతం ఈమె తమిళ్ , తెలుగు ఇండస్ట్రీలలో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్గా కెరియర్ను కొనసాగిస్తుంది. ఇకపోతే కొంత కాలం క్రితమే ఈమె బేబీ జాన్ అనే మూవీ తో హిందీ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయిన ఈ మూవీ ద్వారా ఈమెకు హిందీ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు వచ్చింది. దానితో ఈమెకు మరో క్రేజీ హిందీ సినిమాలో ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది.

అసలు విషయం లోకి వెళితే ... బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి రన్బీర్ కపూర్ నెక్స్ట్ మూవీ లో కీర్తి సురేష్ హీరోయిన్గా కనిపించబోతున్నట్లు , ఇప్పటికే ఈ విషయమై కీర్తి సురేష్ తో మేకర్స్ సంప్రదింపు జరపగా ఈమె కూడా రన్బీర్ కపూర్ హీరోగా రూపొందబోయే సినిమాలో హీరోయిన్గా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. నిజంగానే కీర్తి సురేష్ కి రన్బీర్ కపూర్ హీరోగా రూపొందబోయే సినిమాలో హీరోయిన్గా అవకాశం వస్తే అది ఈమెకు అద్భుతమైన క్రేజీ ఆఫర్ అవుతుంది అనేక మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ks