
కానీ ఎంపురాన్ రిలీజ్ కి ముందు టికెట్ ఫ్రీ సేల్స్ ద్వారా ఇప్పటికే 50 కోట్లు దాటేసింది .. ఇక ఇది మలయాళ ఇండస్ట్రీ స్థాయిని పూర్తిగా మార్చేసి మరో స్థాయికి తీసుకువెళ్లింది . అలాగే ఫ్రీ బుకింగ్ లోను బుక్ మై షో లో 24 గంటల్లో 6.3 లక్షల టికెట్లు అమ్ముడై పోవటం కూడా ఈ సినిమాపై ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో తెలుస్తుంది .. ఇక బాలీవుడ్లో చెన్నై ఎక్స్ప్రెస్ , టాలీవుడ్ లో బాహుబలి , కోలీవుడ్లో కబాలి , కన్నడ కేజిఎఫ్ 2 లు ఆయా ఇండస్ట్రీలో మొట్టమొదటిసారి 50 కోట్లు అందుకున్న సినిమాలు ..
ఇప్పుడు ఆ సినిమాల స్థాయిలోనే ఎంపురాన్ స్కేల్ ఎంత మాస్‌గా ఉందో అర్థమవుతుంది .. మలయాళ సినిమా చరిత్రలో ఇది ఒక సరికొత్త మలుపు .. ఎందుకు గల కారణాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి .. మోహన్‌లాల్ లాంటి లెజెండ్రీ హీరో పృథ్వీరాజ్ లాంటి హీరో కం టాలెంట్ డైరెక్టర్ . అలాగే దేశవ్యాప్తంగా రిలీజ్ కు ప్రణాళిక ఇవన్నీ కలిపి ఈ హైప్ ని తెచ్చిపెట్టాయి .. ఎంపురాన్ .. మొదటి భాగం లూసీ ఫర్ కి ఉన్న క్రేజీ తో పాటు ఈ సీక్వెల్ ను మరింత గ్రాండ్గా ప్లాన్ చేయటం బాగా వర్కౌట్ అయింది .
అయితే ఇది కేవలం మలయాళ సినిమా కాకుండా తమిళం , తెలుగు , హిందీ , కన్నడ భాషలోనూ రిలీజ్ చేస్తున్నారు .. అన్ని ప్రాంతాల్లోనూ భారీ థియేటర్లో రిలీజ్ కావటం .. ఈ ఫ్యాక్టర్లు అన్ని కలిసి పాన్ ఇండియా సినిమాల ఈ సినిమాను మార్చేశాయి .. ప్రధానంగా తెలుగులో దిల్ రాజు ఈ సినిమాను రిలీజ్ చేయడంతో ఇక్కడ మార్కెట్లోని భారీ కలెక్షన్లు ఆశిస్తున్నారు . ఇక ఈ ఓపెనింగ్ బిజినెస్ చూస్తుంటే ఎంపురాన్ సినిమా మలయాళ చిత్ర పరిశ్రమకు సరికొత్త టర్నింగ్ పాయింట్ గా నిలవబోతోంది .