తమిళ నటుడు మరియు దర్శకుడు అయినటువంటి ప్రదీప్ రంగనాథన్ గురించి ప్రత్యేక పరిచ యం అవసరం లేదు . ఈయన ఇప్పటి వరకు మూడు సినిమాలలో నటించ గా ఆ మూడు సినిమాలు కూడా అద్భుతమైన విజయాలను అందుకున్నా యి. ఇకపోతే కొంత కాలం క్రితం ఈయన లవ్ టు డే అనే సినిమాలో హీరో గా నటించడం మాత్రమే కాకుండా ఆ మూవీ కి దర్శకత్వం కూడా వహించాడు. తమిళ్ లో మంచి విజయం సాధించిన ఈ మూవీ ని ఆ తర్వాత కొంత కాలానికి తెలుగు లో కూడా విడుదల చేశారు. తెలుగులో కూడా ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

తాజాగా ఈ నటుడు డ్రాగన్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ ని తమిళ్ , తెలుగు భాషలలో విడుదల చేయగా ఈ రెండు ప్రాంతాల్లో కూడా ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ప్రదీప్ రంగనాథన్ తన కెరియర్ లో నాలుగవ మూవీ ని మైత్రి సంస్థ లో చేయబోతున్నాడు. ఇకపోతే ప్రదీప్ నాలుగవ సినిమాలో ఏకంగా ముగ్గురు హీరోయిన్లు కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ప్రదీప్ నాలుగవ సినిమాలో టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎంతో మంది స్టార్ హీరోలతో నటించినా అను ఇమాన్యుయల్ ,  ప్రేమలు ఫేమ్ మమతా బిజు మరియు ఐశ్వర్య శర్మ హీరోయిన్లుగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

ఇలా ప్రదీప్ నాలుగవ మూవీ లో ముగ్గురు హీరోయిన్లు కనిపించనున్నట్లు ఈ వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇకపోతే వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న ప్రదీప్ నటిస్తున్న మూవీ కావడం , ఆ సినిమాను మైత్రి సంస్థ వారు నిర్మించనుండడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొనే అవకాశం చాలా వరకు ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: