టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ బ్యానర్లలో మైత్రీ మూవీ మేకర్స్ ఒకటనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ బ్యానర్ వరుసగా పాన్ ఇండియా సినిమాలను నిర్మిస్తుండటం గమనార్హం. వచ్చే ఏడాది ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ, చరణ్ బుచ్చిబాబు కాంబో మూవీ, ప్రభాస్ హను రాఘవపూడి మూవీ, రిషబ్ శెట్టి ప్రశాంత్ వర్మ మూవీ, పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబో సినిమాలు రిలీజ్ కానున్నాయి.
 
ఈ 5 సినిమాలపై ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో మరే టాప్ బ్యానర్ ఈ స్థాయిలో సినిమాలను నిర్మించడం లేదనే సంగతి తెలిసిందే. స్క్రిప్ట్ సెలక్షన్ లో జాగ్రత్తలు తీసుకోవడమే మైత్రీ బ్యానర్ సక్సెస్ సీక్రెట్ అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదని చెప్పవచ్చు.
 
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు భారీ మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తుండగా ఈ నిర్మాతలకు లాభాలు ఆభాలు సైతం అదే స్థాయిలో ఉన్నయి. 2026 కేరాఫ్ మైత్రీ మూవీ మేకర్స్ అని చెప్పడంలో సందేహం అవసరం లేదు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు 2026 సంవత్సరంలో అన్ని పండుగలను టార్గెట్ చేసే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
 
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలకు కేరీర్ పరంగా తిరుగులేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ బ్యానర్ లో తెరకెక్కుతున్న ప్రతి సినిమా 300 నుంచి 400 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతుండటం గమనార్హం. పుష్ప2 సక్సెస్ ఇచ్చిన ఉత్సాహంలో మైత్రీ ప్రొడ్యూసర్స్ భారీ సంఖ్యలో సినిమాలను నిర్మిస్తున్నారు. మైత్రీ బ్యానర్ ఇండియన్ ఇండస్ట్రీలోనే టాప్ లో నిలిచే ఛాన్స్ అయితే ఉంది. టాలీవుడ్ టాప్ బ్యానర్  మైత్రీ బ్యానర్ లో తెరకెక్కనున్న కొత్త సినిమాలు పుష్ప2 సినిమాను మించిన విజయాన్ని అందుకుంటుందేమో చూడాలి.




మరింత సమాచారం తెలుసుకోండి: