ఈ మధ్య కాలంలో కొన్ని సినిమాలు అత్యంత వేగంగా ఓ టి టి ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇస్తూ ఉంటే మరికొన్ని సినిమాలు మాత్రం చాలా ఆలస్యంగా ఓ టీ టీ లోకి ఎంట్రీ ఇస్తున్నాయి. అందుకు ప్రధాన కారణం ఇండియా వ్యాప్తంగా ప్రతి వారం అనేక సినిమాలు విడుదల అవుతూ ఉండడంతో ఓ టీ టీ ప్లాట్ ఫామ్ వారు కూడా తమకు నచ్చిన సినిమాలను మాత్రమే ఎంచుకుంటూ వాటిని కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దానితో కొన్ని క్రేజీ లేని సినిమాలు , అలాగే బాక్సా ఫీస్ దగ్గర సత్తా చటాని సినిమాలు ఓ టి టి ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వడం చాలా కష్టంగా మారుతుంది.

ఇకపోతే కొన్ని రోజుల క్రితం విడుదల అయ్యి బాక్సా ఫీస్ దగ్గర పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకున్న ఓ సినిమా మరికొన్ని రోజుల్లోనే ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. అసలు విషయం లోకి వెళితే ... సందీప్ కిషన్ హీరోగా రీతూ వర్మ హీరోయిన్గా త్రినాధ్ రావు నక్కిన దర్శకత్వంలో మజాకా అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ పోయిన నెల విడుదల అయ్యి పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. రావు రమేష్ , అన్షు ఈ సినిమాలో కీలక పాత్రలలో నటించారు. ప్రసన్న కుమార్ బెజవాడ ఈ సినిమాకు కథను అందించాడు.

ఇకపోతే ఈ మూవీ యొక్క ఓ టీ టీ హక్కులను జీ 5 సంస్థ వారు దక్కించుకున్నారు. అందులో భాగంగా ఈ సినిమాను మార్చి 28 వ తేదీ నుండి జీ 5 ఓ టి టి ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఈ ఓ టి టి సంస్థ వారు తాజాగా అధికారికంగా ప్రకటించారు. మరి ఈ సినిమా ఓ టి టి ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ott