తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటులలో నితిన్ ఒకరు. నితిన్ ఈ మధ్య కాలంలో మాత్రం బాక్సా ఫీస్ దగ్గర సరైన విజయాలను అందుకోవడం లేదు. ఆఖరుగా ఈయన నటించిన మాచర్ల నియోజకవర్గం , ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ మూవీలు వరసగా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ఇలా వరుస అపజయాల తర్వాత ఈయన తనకు బాక్సా ఫీస్ దగ్గర ఇది వరకు భీష్మ మూవీ తో మంచి విజయాన్ని అందించిన వెంకీ కుడుమల దర్శకత్వంలో రాబిన్ హుడ్ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో శ్రీ లీల హీరోయిన్గా నటించగా ... ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఈ మూవీ లో ఓ కీలకమైన పాత్రలో నటించాడు.

మైత్రి సంస్థ వారు నిర్మించిన ఈ మూవీ కి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు. ఇకపోతే ఈ సినిమాను మార్చి 28 వ తేదీన థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ మధ్య కాలంలో చాలా సినిమాల విడుదలకు ముందు ఆ మూవీలకు సంబంధించిన ప్రీమియర్ షో లను పెద్ద ఎత్తున ప్రసారం చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మధ్య కాలంలో విడుదల అయిన చాలా శాతం సినిమాలకు ప్రీమియర్ షో ల ద్వారా అద్భుతమైన కలెక్షన్లు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇకపోతే తాజాగా రాబిన్ హుడ్ మూవీ బృందం ఒక పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించింది.

అందులో భాగంగా ఈ సినిమా నిర్మాత అయినటువంటి రవి శంకర్ కి రాబిన్ హుడ్ మూవీ కి ప్రీమియర్ షో లను ప్రదర్శించడం లేదా ... ప్రదర్శించకపోతే ఎందుకు ప్రదర్శించడం లేదు అనే ప్రశ్న ఎదురయింది. దానికి ఆయన సమాధానం చెబుతూ ... రాబిన్ హుడ్ సినిమాకు సంబందించిన ప్రీమియర్ షో లను ప్రదర్శించడం లేదు. గతంలో మేము నిర్మించిన సినిమాల ప్రీమియర్ షో ల ద్వారా మాకు చేదు అనుభవం ఎదురయింది. అందుకే ఈ సినిమా ప్రీమియర్ షో లను వేయడం లేదు అని రాబిన్ హుడ్ మూవీ నిర్మాత అయినటువంటి రవి శంకర్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: