టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న నిర్మాతగా కెరియర్ను కొనసాగిస్తున్న వారిలో సూర్య దేవర నాగ వంశీ ఒకరు. ఈయన ఈ మధ్య కాలంలో సీతార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై వరుస పెట్టి సినిమాలను నిర్మిస్తూ వస్తున్నాడు. అలాగే రీసెంట్ టైమ్ లో ఈయన బ్యానర్ నుండి వచ్చిన చాలా సినిమాలు బాక్సా ఫీస్ దగ్గర అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. దానితో ఈయన బ్యానర్ నుండి సినిమా వస్తుంది అంటే చాలు దానిపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడుతున్నాయి. తాజాగా నాగ వంశీ "మ్యాడ్" మూవీ కి కొనసాగింపుగా మ్యాడ్ స్క్వేర్ అనే మూవీ ని నిర్మించాడు.

మూవీ ని మార్చి 28 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమా నుండి అనేక ప్రచార చిత్రాలను ఈ మూవీ మేకర్స్ విడుదల చేయగా అవి అద్భుతంగా ఉండడంతో ఈ సినిమాపై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఇకపోతే ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలకు విడుదలకు ముందు ఆ మూవీ లకు సంబంధించిన ప్రీమియర్ షో లను ప్రదర్శిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. విడుదలకు ముందు రోజు ప్రీమియర్ షో లను ప్రదర్శించడం వల్ల ప్రీమియర్ షో ల ద్వారా మూవీలకు మంచి టాక్ వచ్చినట్లయితే ఆ మూవీ లకు మొదటి రోజు ఓపెనింగ్స్ కూడా సూపర్ సాలిడ్ గా దక్కుతున్నాయి. దానితో అనేక మంది నిర్మాతలు ఈ ఫార్ములాను ఫాలో అవుతూ వస్తున్నారు.

దానితో మ్యాట్ స్క్వేర్ మూవీ బృందం కూడా ఈ మూవీ కి సంబంధించిన ప్రీమియర్ షో లను ఈ మూవీ విడుదలకు ముందు ప్రదర్శిస్తుంది అని చాలా మంది అనుకున్నారు. కానీ ఈ మూవీ కి సంబంధించిన ప్రీమియర్ షో లను ప్రదర్శించే ఆలోచనలో ఈ మూవీ నిర్మాత నాగ వంశీ లేనట్లు తెలుస్తోంది. దానితో ఈ సినిమాకు సంబంధించిన టాక్ రావడం కోసం ప్రేక్షకులు రేపటి వరకు ఆగాల్సిందే. మరి ఈ సినిమాకు ఎలాంటి టాక్ వస్తుందో ... ఈ మూవీ ఏ రేంజ్  విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: