
ఇక నిన్న జరిగిన మ్యాడ్ 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఎన్టీఆర్ , అల్లు అర్జున్ సినిమాల ప్రస్తావన వచ్చింది .. ఇక అందులో అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చే సినిమా ఈ సంవత్సరం ఎండింగ్లో మొదలవుతుందని చెప్పుకొచ్చాడు .. అలాగే ఇది బిగ్ స్కేల్ మూవీ అంటూ నాగవంశి చెప్పాడు .. ఆ తర్వాత నెల్సన్ ప్రాజెక్ట్ పై కూడా స్పందించాడు .. మా బ్యానర్ లో నెల్సన్ గారు దర్శకత్వంలో ఒక సినిమా ఉంటుంది .. కానీ అందులో హీరో ఎవరు అనే విషయంలో క్లారిటీ రావడం లేదు ? అంటూ నాగ వంశీ పెద్ద బాంబు పేల్చాడు .. ఎందుకంటే సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మాణంలో నెల్సన్ , ఎన్టీఆర్ సినిమా ఉంటుందని గట్టిగా ప్రచారం కూడా జరిగింది .
పలు ఇంటర్వ్యూలో కూడా నెల్సన్ , ఎన్టీఆర్ కాంబినేషన్లో సినిమా చేయాలని ఆశ పడుతున్నట్టు నాగ వంశీ కూడా చెప్పాడు .. అయితే ఇప్పుడు ఈ కాంబో ఫిక్స్ అని అంతా అనుకున్నారు .. ఎన్టీఆర్ అభిమానులు కూడా ఈ ప్రాజెక్టుకు సంబంధించి అనౌన్స్మెంట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు . ఆల్మోస్ట్ అంతా కన్ఫర్మ్ అనుకున్న కాంబోలో హీరో ఎవరో చెప్పలేనని నిర్మాత నాగవంశీ అనటం ఎవరికి డైజస్ట్ అవటం లేదు .. ఒకవేళ ఎన్టీఆర్ కి నెల్సన్ చెప్పిన కథ నచ్చలేదా ? ఎన్టీఆర్ తో నాగ వంశీ వేరే సినిమా ప్లాన్ చేస్తున్నాడా ? లేదు అంటే ఈ న్యూస్ ఇంకా వైరల్ అవ్వాలని అతని తాపత్రయమా ? అన్నది ప్రస్తుతానికి ఎంతో సస్పెన్స్ గా మారింది ..