టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ కలిగిన నటులలో ఒకరు అయినటువంటి నితిన్ తాజాగా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన రాబిన్ హుడ్ అనే కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. శ్రీ లీల ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా ... జీవి ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఈ మూవీ లో ఓ ముఖ్యమైన క్యామియో పాత్రలో కనిపించనుండగా ... మైత్రి సంస్థ వారు ఈ మూవీ ని నిర్మించారు. ఈ సినిమాను మార్చి 28 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన అన్ని ఏరియాల థియేటర్ హక్కులను ఈ మూవీ నిర్మాతలు అమ్మి వేశారు. మరి ఈ సినిమాకు ఏ ఏరియాలో ఏ రేంజ్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా ఎన్ని కోట్ల టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగబోతుంది అనే వివరాలను తెలుసుకుందాం.

ఈ సినిమాకు నైజాం ఏరియాలో 9.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా , సీడెడ్ ఏరియాలో 3 కోట్లు , ఆంధ్రలో 10.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మొత్తంగా ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 23 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇక కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లలో కలుపుకొని ఈ సినిమాకు 4.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మొత్తంగా ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 27.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ 28.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగనుంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 28.50 కోట్ల షేర్ కలెక్షన్లను రాబట్టినట్లయితే హిట్ స్టేటస్ ను అందుకుంటుంది. మరి ఈ సినిమా ఏ స్థాయి కలెక్షన్లను వసూలు చేసి ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: