కొన్ని సంవత్సరాల క్రితం నాగార్జున , కార్తీ హీరోలుగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఊపిరి అనే మూవీ వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. మంచి అంచనాల నడుమ 2016 వ సంవత్సరం మార్చి 25 వ తేదీన విడుదల ఆయన ఈ సినిమా ఆ సమయంలో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా విడుదల అయ్యి ఈ సంవత్సరం మార్చి 25 వ తేదీతో తొమ్మిది సంవత్సరాలు పూర్తి అయింది. ఈ మూవీ విడుదల అయ్యి తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సినిమాకు ఫైనల్ బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఎన్ని కలెక్షన్లు వచ్చాయి. ఈ మూవీ ద్వారా బయ్యర్లకు ఎన్ని కోట్ల లాభాలు దక్కాయి అనే వివరాలను తెలుసుకుందాం.

టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఊపిరి మూవీ కి నైజాం ఏరియాలో 8.45 కోట్ల కలెక్షన్లు దక్కాగా , సీడెడ్ ఏరియాలో 3.25 కోట్లు , ఉత్తరాంధ్రలో 3.03 కోట్లు , ఈస్ట్ లో 1.95 కోట్లు , వెస్ట్ లో 1.31 కోట్లు , గుంటూరులో 2.0 కోట్లు , కృష్ణ లో 1.73 కోట్లు , నెల్లూరులో 85 లక్షల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ మూవీ కి టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 22.71 కోట్ల కలెక్షన్లు దక్కాయి. ఇక ఈ మూవీ కి తమిళనాడు ఏరియాలో 14.91 కోట్ల కలెక్షన్లు దక్కగా , రెస్ట్ ఆఫ్ ఇండియాలో 6.30 కోట్లు , ఓవర్సీస్ లో 8.38 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 52.30 కోట్ల కలెక్షన్లు దక్కాయి. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 44 కోట్ల టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగింది. ఈ మూవీ 52.3 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేసింది. దానితో ఈ ఈ మూవీ ద్వారా బయ్యర్లకు 8.3 కోట్ల రేంజ్ లో లాభాలు వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: