టాలీవుడ్ ఇండస్ట్రీ లో దర్శకుడిగా మంచి కనీసం సంపాదించుకున్న వారిలో వెంకి కుడుముల ఒకరు. ఈయన నాగ శౌర్య హీరోగా రష్మిక మందన హీరోయిన్గా రూపొందిన ఛలో అనే మూవీ తో దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టాడు. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో మొదటి మూవీ తోనే దర్శకుడిగా వెంకీ కుడుములకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఈయన నితిన్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా భీష్మ అనే మూవీ ని రూపొందించాడు. ఈ మూవీ కూడా సూపర్ సక్సెస్ అయింది. తాజాగా వెంకీ , నితిన్ హీరోగా శ్రీ లీల హీరోయిన్గా రాబిన్ హుడ్ అనే సినిమాను రూపొందించాడు.

మూవీ రేపు అనగా మార్చి 28 వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో నిన్న ఈ మూవీ బృందం పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పరిచింది. అందులో భాగంగా వెంకీ కుడుమలకు మీరు గతంలో రూపొందించిన భీష్మ మూవీ కథను మొదట త్రివిక్రమ్ గారికి వినిపించారట. రాబిన్ హుడ్ మూవీ కథను కూడా త్రివిక్రమ్ గారికి వినిపించారా ..? అనే ప్రశ్న ఎదురయింది. దానికి వెంకి సమాధానం ఇస్తూ ... నేను గతంలో రూపొందించిన ఛలో మరియు భీష్మ ఈ రెండు సినిమాలకు సంబంధించిన కథలను మొదట త్రివిక్రమ్ గారికి వినిపించలేదు. కాకపోతే ఆ రెండు సినిమాలను విడుదలకు ముందే ఆయనకు చూపించాను.

ఆ సినిమాలు చూసిన ఆయన అద్భుతంగా తీశావు అని ప్రశంసించాడు అని సమాధానం ఇచ్చాడు. ఇకపోతే రాబిన్ హుడ్ మూవీ కి జీ వి ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా ... ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఈ మూవీ లో ఓ చిన్న క్యామియో పాత్రలో కనిపించబోతున్నాడు. మైత్రి సంస్థ వారు ఈ సినిమాను నిర్మించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Vk