
రష్మిక కోన్నటువంటి కారు ధర సుమారుగా రెండు కోట్ల రూపాయలు ఉంటుందట. మెర్సీడేస్ బెంజ్ S -450 కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఖరీదైన కారులో రష్మిక తెగ ఎంజాయ్ చేస్తూ తిరుగుతోందట. ఇప్పటికే రష్మిక వద్ద కూడా 5 లగ్జరీ కారులు కూడా ఉన్నాయి. కేవలం ఈ కార్లు కోసం కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది రష్మిక.. ప్రస్తుతం రష్మిక నటించిన సినిమాల విషయానికి వస్తే ఇటీవలే ఛావా చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ సల్మాన్ ఖాన్ తో సికిందర్ సినిమాలో నటించినది.
ఈ సినిమా కూడా త్వరలోనే రిలీజ్ కి సిద్ధమవుతున్నది.. ముఖ్యంగా సల్మాన్ ఖాన్ తో రొమాన్స్ చేయడంతో చాలామంది ట్రోల్ కూడా చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా రష్మిక విభిన్నమైన పాత్రలలో నటిస్తూ అభిమానులనే కాకుండా అందరి చేత శభాష్ అనిపించుకునేలా పాత్రలను ఎంచుకుంటోంది. ప్రస్తుతం కుబేర సినిమాలతో పాటు మరొక లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో కూడా నటిస్తూ ఉన్నది ఈ ముద్దుగుమ్మ. నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులకు సినిమాల గురించి వెకేషన్ గురించి అప్పుడప్పుడు తెలియజేస్తూ ఉంటుంది. ఒక్కో చిత్రానికి 8 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్న రష్మిక.