దాదాపు రెండు సంవత్సరాల క్రితం ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్టైనర్ మూవీగా మ్యాడ్ అనే మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని అందుకున్న విషయం మన అందరికీ తెలిసింది. ఈ సినిమాను సీతార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగ వంశీ నిర్మించాడు. మ్యాడ్ మూవీ మంచి విజయం సాధించడంతోనే ఈ మూవీ బృందం వారు ఆ సినిమాకు కొనసాగింపుగా మ్యాడ్ స్క్వేర్ అనే మూవీ ని రూపొందించనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే మ్యాడ్ మూవీ కి కొనసాగింపుగా మ్యాడ్ స్క్వేర్ సినిమాను రూపొందించారు. ఈ మూవీ ని మార్చి 28 వ తేదీన విడుదల చేయనున్నారు.

ఇది ఇలా ఉంటే మ్యాడ్ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో మొదటి నుండి కూడా మ్యాడ్ స్క్వేర్ మూవీ పై తెలుగు ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఇక మ్యాడ్ స్క్వేర్ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ నుండి మేకర్స్ అనేక ప్రచార చిత్రాలను విడుదల చేశారు. అవి ప్రేక్షకులను అద్భుతమైన స్థాయిలో ఆకట్టుకోవడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన యు ఎస్ ఏ ప్రీమియర్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి.

మూవీ యు ఎస్ ఏ ప్రీమియర్స్ బుకింగ్స్ అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి లభిస్తుంది. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా యూ ఎస్ ఏ ప్రీమియర్స్ ప్రీ సేల్స్ కు సంబంధించిన ఒక పోస్టర్ ను విడుదల చేసారు. ఆ పోస్టర్ ప్రకారం మ్యాడ్ స్క్వేర్ మూవీ కి ఇప్పటికే యూ ఎస్ ఏ లో ప్రీమియర్స్ ప్రీ సేల్స్ ద్వారా 200 కే ప్లస్ కలెక్షన్లు దక్కినట్లు ఈ మూవీ బృందం ప్రకటించింది. ఈ పోస్టర్ ద్వారా యూ ఎస్ ఏ లో కూడా ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: