టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోలు ఉన్న సంగతి తెలిసిందే. అందులో ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా చిత్ర పరిశ్రమకు పరిచయమై మంచి గుర్తింపును సంపాదించుకున్న వారు ఎందరో ఉన్నారు. అలాంటి వారిలో నటుడు విజయ్ దేవరకొండ ఒకరు. ఈ హీరో రౌడీ బాయ్ గా తన నటనతో ప్రేక్షకులలో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. గీతగోవిందం సినిమాతో ఒక్కసారిగా విజయ్ దేవరకొండ స్టార్ హీరోగా గుర్తింపు అందుకున్నాడు.


కాగా, ఈ సినిమా అనంతరం విజయ్ దేవరకొండ ఎన్నో సినిమాలు చేసినప్పటికీ పెద్దగా సక్సెస్ అందుకోలేకపోతున్నాడు. లైగర్, ఖుషి, ది ఫ్యామిలీ స్టార్ లాంటి సినిమాలు డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నాయి. దాదాపు చాలా కాలం నుంచి విజయ్ దేవరకొండ ఖాతాలో ఒక్క హిట్ కూడా పడడం లేదు. తన సినిమాల ద్వారా మంచి సక్సెస్ అందుకోవాలని తనతో విజయ్ దేవరకొండ ఎప్పుడు ఏదో ఒక సినిమాలో నటిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ పెద్దగా రాణించలేకపోతున్నారు. కాగా, విజయ్ దేవరకొండ తాజాగా "రౌడీ జనార్ధన్" సినిమాలో నటిస్తున్నారు.


ఈ సినిమాకు రవి కిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ గా మహానటి కీర్తి సురేష్ ను ఎంపిక చేసినట్లుగా సినీవర్గాలు వెల్లడించాయి. మొదట ఈ సినిమాలో కీర్తి సురేష్ స్థానంలో కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ ను ఈ పాత్ర కోసం ఎంపిక చేయగా ఆమె మొదట ఒప్పుకున్నారట. అనంతరం ఏవో కారణాలవల్ల ఆమె సినిమాలో నటించినని చెప్పిందట.


దీంతో కీర్తి సురేష్ ను సంప్రదించగా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం అందుతుంది. ఈ చిత్రంలో ఆమె పాత్ర ఎక్కువగా గోదావరి మాండలికంలోనే మాట్లాడే విధంగా కథ రూపొందించారట. కాగా ఈ పాత్రలో కీర్తి సురేష్ ఎంతో చక్కగా నటిస్తుందని దర్శకుడు భావించారట. విజయ్ దేవరకొండ, కీర్తి సురేష్ కాంబినేషన్లో రాబోయే రౌడీ జనార్దన్ సినిమా మంచి సక్సెస్ అందుకుంటుందని అభిమానులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: