టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోలు ఉన్న సంగతి తెలిసిందే. అందులో మెగా హీరో రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చిరంజీవి వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ తనదైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపును అందుకున్న రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ హీరోగా ఎదిగిన సంగతి తెలిసిందే. ఇక రామ్ చరణ్ దర్శకుడు బుచ్చి బాబుతో కలిసి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.


ఈ సినిమాకు ఆర్సి 16 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈరోజు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఆర్సి 16 నుంచి  అధికారిక అప్డేట్ వెలువడింది. ఆర్సి 16 సినిమాకు గాను పెద్ది అనే టైటిలను ఫిక్స్ చేశారు. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేయగా ప్రేక్షకులలో మంచి అంచనాలు ఏర్పడుతున్నాయి. ఈ సినిమాలో శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ హీరోయిన్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.


ఇదిలా ఉండగా.... రామ్ చరణ్ ఉపాసనను ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరు కొద్ది రోజుల క్రితమే ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఇక రామ్ చరణ్ సినిమాలలో నటిస్తున్న సమయంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అతడిని వివాహం చేసుకోవాలని అనుకుందట. ఆ హీరోయిన్ మరెవరో కాదు కాజల్ అగర్వాల్. వీరిద్దరూ కలిసి మగధీర సినిమాలో కలిసి నటించారు.


సినిమా సమయంలోనే కాజల్ రామ్ చరణ్ పై ప్రేమను పెంచుకుందట. కానీ అప్పటికే రామ్ చరణ్ ఉపాసనను ప్రేమిస్తున్నాడని తెలిసి తన ప్రేమను మనసులోనే దాచుకుందట. అనంతరం కాజల్ కొన్ని సంవత్సరాలకి గౌతమ్ కిచ్లు అనే వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకుంది. ఈ జంట పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ప్రస్తుతం రామ్ చరణ్, కాజల్ మంచి స్నేహితులుగా వారి రిలేషన్ కొనసాగిస్తున్నారు. ఇక ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ ఈ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: