
అంతేకాకుండా ముంబైలో ఉండేటువంటి సల్మాన్ ఖాన్ ఇంటికి కూడా బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ ఏర్పాటు చేశారు. వరుసగా బెదిరింపులు నేపథ్యంలో షూటింగ్స్ లో పరంగా కూడా చాలా జాగ్రత్తగా తీసుకుంటున్నట్లు సమాచారం అలాగే అవుట్ డోర్ షూటింగ్లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న సమయంలో తాజాగా ఈ బెదిరింపుల పైన సల్మాన్ ఖాన్ స్పందించడం జరిగింది.. సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ తాను దేవుడిని ఎక్కువగా నమ్ముతానని ఆయనే అన్ని చూసుకుంటారంటూ తెలిపారు.. ఎవరి ఆయుషు ఉన్నంతకాలం వారు మాత్రమే జీవిస్తారని తెలిపారు.
ఈ బెదిరింపుల కారణంగా ఇంటి వద్ద షూటింగ్ లొకేషన్స్ ఇలా చాలాచోట్ల తన చుట్టూ ఎక్కువగా భద్రత పెరిగిపోయిందని కొన్నిసార్లు ఈ భద్రత కూడా సవాలుగా మారుతూ ఉంటుందని తెలిపారు.. చెప్పాలి అంటే చావు వచ్చే సమయంలో ఎలాంటివి ఏవి కూడా ఆపలేవని తెలిసి కూడా తపన పడడం జాగ్రత్తలు పడడం వంటివి శుద్ధ దండగ అన్నట్టుగా తన అభిప్రాయమని తెలియజేశారు సల్మాన్ ఖాన్.. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ చేసిన ఈ వాక్యాలు వైరల్ అవుతున్నాయి. ఇటీవలే రష్మిక ,సల్మాన్ ఖాన్ కాంబినేషన్లో సికిందర్ సినిమా త్వరలోనే రిలీజ్ కాబోతోంది. ఇటీవలే విడుదలైన ట్రైలర్ కు కూడా బాగానే రెస్పాన్స్ లభించింది.