
ఇదే మూమెంట్లో సోషల్ మీడియాలో రామ్ చరణ్ కి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి . మరీ ముఖ్యంగా రామ్ చరణ్ నటించిన సినిమాలంటే ఆయన అభిమానులు అందరికీ ఇష్టమే . ప్రతి సినిమాను లైక్ చేస్తారు ముందుకు తీసుకెళ్తారు . మరి మెగా ఫ్యామిలీకి ..? మెగా ఫ్యామిలీకి రాంచరణ్ నటించిన సినిమా ఏది ఇష్టం..? అనే విషయం ఇంట్రెస్టింగ్ గా మారింది. చాలామందికి రాంచరణ్ నటించిన "మగధీర" సినిమా అంటే ఇష్టం . అయితే మెగా ఫ్యామిలీ మొత్తం కన్నీళ్లు పెట్టుకున్న సినిమా మాత్రం ఒకే ఒక్కటి .
అదే "రంగస్థలం". రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ చూసిన ప్రతి ఒక్క మెగా అభిమాని అదే విధంగా మెగా ఫ్యామిలీ మెంబర్ ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వక తప్పదు. మరీ ముఖ్యంగా చెవిటి పాత్రలో రామ్ చరణ్ లీనం అయిపోయినటించాడు . నిజానికి ఈ సినిమాకి ఆయనకు నేషనల్ అవార్డు రావాల్సి ఉంది . అప్పట్లో అందరూ అదే మాట్లాడుకున్నారు . కానీ మిస్ అయిపోయింది . నెక్స్ట్ కచ్చితంగా రామ్ చరణ్ కి సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలో మంచి పాత్ర ఉంటుంది అని ఆ సినిమాతో కచ్చితంగా నేషనల్ అవార్డు కొడతాడు అంటున్నారు అభిమానులు. సోషల్ మీడియాలో ప్రజెంట్ ఇదే న్యూస్ బాగా ట్రెండ్ అవుతూ వైరల్ గా మారింది..!