టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతోమంది యాంకర్లు ఉన్న విషయం తెలిసిందే. అందులో కొంతమంది మాత్రమే వారి యాక్టింగ్ స్టైల్, హోస్టింగ్ తో మంచి గుర్తింపు సంపాదించుకుంటారు. అలాంటి వారిలో యాంకర్ విష్ణు ప్రియ ఒకరు. ఈ చిన్నదాని గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పోవే పోరా షోతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ చిన్నది ఓవర్ నైట్ లోనే మంచి క్రేజ్ అందుకుంది. ఆ షో తర్వాత వివిధ షోలలో తన యాంకరింగ్ తో మంచి గుర్తింపు అందుకుంది.


అనంతరం కొన్ని షోలలో తన హోస్టింగ్ తో ప్రేక్షకులలో చెరగని ముద్ర వేసుకుంది. సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిన్నది తన నటన, అందంతో మంచి తెచ్చుకుంది. సినిమాలు, షోలు, వెబ్ సిరీస్ లు మాత్రమే కాకుండా విష్ణు ప్రియ యూట్యూబ్ ఛానల్ అని కూడా నిర్వహిస్తుండడం గమనార్హం. ఈ చిన్నది సోషల్ మీడియాలో విపరీతంగా యాక్టివ్ గా ఉంటున్న సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే.


సోషల్ మీడియాలో ఈ చిన్నది తన అందాలను చూపకనే చూపిస్తూ సోషల్ మీడియాలో హీట్ పెంచుతూ ఉంటుంది. విష్ణు ప్రియ పోస్ట్ చేసే ఫోటోలకు విపరీతంగా లైక్స్ వస్తూ ఉంటాయి. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం ఈ చిన్నది ఓ షోలో పాటిస్పేట్ చేసింది. ఆ షోలో భాగంగా విష్ణు ప్రియ మాట్లాడుతూ తనకు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకుంది.


అందులో భాగంగానే విష్ణు ప్రియ తన క్రష్ ఎవరో రివిల్ చేసింది. తనకు అక్కినేని అఖిల్ అంటే చాలా ఇష్టమని తనపై నాకు క్రష్ ఉందని విష్ణుప్రియ వెల్లడించింది. తనతో నటించే అవకాశం వస్తే తప్పకుండా నటిస్తానంటూ సంచలన కామెంట్లు చేసింది. ప్రస్తుతం ఈ చిన్నది మాట్లాడిన ఈ మాటలు సోషల్ మీడియా మాధ్యమాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: