
సత్యవతి మరణ వార్త విన్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతూ సోషల్ మీడియా వేదికగా ఆమెకు నివాళులు అర్పించారు. ముఖ్యంగా చిన్నతనంలో మెహర్ కుటుంబం విజయవాడలో ఉండేవారని.. చదువుకునే రోజులలో వేసవి సెలవులు వచ్చినప్పుడు వారి ఇంటికి వెళ్లి మరి ఆడుకునే వారమంటూ తెలియజేశారు. ఇప్పటికీ మెహర్ రమేష్, సత్యవతి కుటుంబంతో కలిసి గడిపిన ఆనంద జ్ఞాపకాలు కూడా అలాగే గుర్తున్నాయని తెలియజేశారు. ఇక మెహర్ రమేష్ తండ్రి కూడా నగరంలో ఎస్సైగా పనిచేశారు.
ఇక మెహర్ రమేష్ తన ఇంజనీరింగ్ పూర్తి చేసుకుని దర్శకుడుగా కావడానికి మొదట బాబి చిత్రంలో ఒక సహాయక పాత్రలో నటించడం జరిగింది. ఆ తర్వాత వీర కన్నడిగ అనే చిత్రంతో మొదటి సారి 2004లో డైరెక్టర్ గా పరిచయమయ్యారు.. ఈ చిత్రాన్ని తెలుగులో ఆంధ్ర వాళ్ళ పేరుతో రిలీజ్ చేశారు. అయితే తెలుగులో సక్సెస్ కాలేదు. ఇక మరొక చిత్రం అజయ్.. ఈ చిత్రాన్ని తెలుగులో మహేష్ బాబు ఒక్కడుగా రీమిక్స్ చేయగా భారీ విజయాన్ని అందుకున్నప్పటికీ తెలుగులో మాత్రం మెహర్ రమేష్ సక్సెస్ కాలేకపోయారు. ఆ తర్వాత కంత్రి, బిల్లా, శక్తి, షాడో ,భోళా శంకర్ వంటి చిత్రాలు తీసిన ఫెయిల్యూర్ గానే మిగిలిపోయాయి.