తెలుగు ఇండస్ట్రీలో హీరో వెంకటేష్ అంటే ఎంతటి ఇమేజ్ ఉంటుందో మనందరికీ తెలుసు. ఆయన ఇప్పటివరకు ఎలాంటి వివాదాలు లేకుండా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు.. ఎప్పుడైనా తన సినిమాలు, షూటింగ్, తన కుటుంబం తప్ప ఇతర ఏ విషయాల్లో వెంకటేష్ బయట కనిపించరు. అలాంటి వెంకటేష్ ఆ ఒక్క హీరోయిన్ ను మాత్రం చాలా ఇష్టపడ్డారని అప్పట్లో అనేక వార్తలు వచ్చాయి..ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరయ్యా అంటే సౌందర్య. సౌందర్యతో ఆయన బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు చేసి సూపర్ హిట్లు అందుకున్నాడు. అంతేకాదు ఆమెతో లవ్ లో కూడా పడ్డారని పెళ్లి కూడా చేసుకుంటారని అప్పట్లో అనేక వార్తలు వినిపించాయి..కానీ చివరికి తన తండ్రి రామానాయుడు మందలించడంతో డెసిషన్ మార్చుకున్నాడు.

 అలా ఇండస్ట్రీలో వెంకటేష్  సౌందర్యపై మనసుపడ్డాడు కానీ వెంకటేష్ పై మనసు పడ్డ మరో హీరోయిన్ ఉంది. అంతేకాదు ఆమె చిన్న వయసు నుండి వెంకటేష్ పై క్రష్ పెంచుకుంది. ఎవరికి తనని పెళ్లి చేసుకుంటానని ఇంట్లో గొడవ కూడా చేసిందట. ఆ హీరోయిన్ ఎవరయ్యా అంటే అందాల తార రాశి.. రాశీ చిన్నతనంలో ఒక మేగజిన్ పై వెంకటేష్ ఫోటో చూసి ఆయనపై మనసు పడిందట. వెంకటేష్ సినిమాలు ఏవి వచ్చినా తాను తప్పకుండా చూసేదట. అలాగే ఇంట్లో వాళ్లతో కూడా నేను వెంకటేష్ ని పెళ్లి చేసుకుంటానని గొడవ చేసేదట. అప్పటికి రాశి టీనేజ్ వయసులోనే ఉంది.

ఈ టైంలో ఆమె పెళ్లి చేసుకుంటానని మాటలు మాట్లాడడంతో తల్లిదండ్రులు కూడా ఆశ్చర్యపోయే వారట. నువ్వు అలా ఎందుకు మాట్లాడుతున్నావ్ అంటూ నవ్వుతూ మందలించారట.. అంతేకాదు స్కూల్ టీచర్లు కూడా నువ్వు భవిష్యత్తులో ఏం అవుతావు అని అడిగితే వెంకటేష్ కు భార్య అయి హౌస్ వైఫ్ అవుతానని చెప్పేదట. అలా వెంకటేష్ ను ఎంతో లవ్ చేసి చివరికి ఆయన ప్రేమను పొందలేదు. ఆ తర్వాత ఆమె ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరోయిన్ గా మారిందని చెప్పవచ్చు. మరో మ్యాగజైన్ పై  రాజీవ్ గాంధీ పై ఫోటో చూసి ఆయన్ని కూడా పెళ్లి చేసుకుంటానని ఇంట్లో గొడవ చేసిందట. ఈ విషయం రాశీ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: