మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి తన టాలెంట్ తో అంచలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తన నటనకు గాను చిరంజీవి ఎన్నో అవార్డులను సైతం అందుకున్న సంఘటనకు తెలిసిందే. ఇక చిరంజీవి దాదాపు 150కి పైగా సినిమాలలో నటించి మంచి గుర్తింపును అందుకున్నారు. చిరంజీవి నటించిన సినిమాలన్నీ దాదాపుగా మంచి విజయాలను అందుకున్నాయి. 

కాగా, చిరంజీవి కెరీర్ ప్రారంభంలో నటించిన చాలెంజ్ సినిమా సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్లుగా విజయశాంతి, సుహాసిని నటించారు. అంతేకాకుండా ఈ సినిమాలో సిల్క్ స్మిత ఓ కీలకపాత్రను పోషించింది. ఛాలెంజ్ సినిమాకు కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో భాగంగా కోదండరామిరెడ్డి హీరో చిరంజీవి, సిల్క్ స్మిత మధ్య సన్నివేశాలను షూట్ చేయాలని ప్లాన్ చేశారట. కానీ ఆ సమయంలో సిల్క్ స్మిత కొంచెం బిజీగా ఉండడం వల్ల షూటింగ్ కు సమయానికి రాలేకపోయిందట.

కొన్ని రోజుల అనంతరం సిల్క్ స్మిత సడన్ గా తాను షూటింగ్ కు వస్తున్నట్లుగా నిర్మాతలకు చెప్పారట. ఆ సమయానికి చిరంజీవి, సుహాసిని మధ్య సన్నివేశాలు చిత్రీకరించే ప్లాన్ చేశారట చిత్ర యూనిట్. కానీ ఆ సమయానికి సిల్క్ స్మిత షూటింగ్ కి వస్తానని చెప్పడంలో దర్శక నిర్మాతలకు ఏమి చేయాలో తోచలేదట. చిరంజీవితో సంప్రదించిన అనంతరం సుహాసిని, చిరంజీవి మధ్య సన్నివేశాలను వాయిదా వేశారట.


ఆరోజు షూటింగ్ కి సుహాసినిని రావద్దని చెప్పారట. ఆ తర్వాత చిరంజీవి, సిల్క్ స్మిత మధ్య వచ్చే సన్నివేశాలను షూట్ చేశారట. కానీ సుహాసిని అలా చెప్పడంతో తాను కాస్త ఫీల్ అయిందట. అనంతరం సుహాసిని షూటింగ్ కు రమ్మని చెప్పినప్పటికీ తాను రాలేదట. కానీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ సుహాసిని షూటింగ్ కు వచ్చి వచ్చారట. కాగా, ఈ సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: