
ఆలియా సినిమాలు, వ్యక్తిగత విషయాలలో కూడా బాగా బ్యాలెన్స్ చేసుకుంటుంది. అందుకే ఆమె ఇప్పటికీ సంతోషంగా ఉన్నదని తెలిపింది. సినీ కెరియర్ లో ఈ స్థాయికి రావడం కోసం ఆలియా భట్ చాలా కష్టపడిందని ఎన్నో సవాళ్లను సైతం ఆమే ఎదుర్కొన్నదని ఆమెకు జాతీయ అవార్డు వచ్చినప్పుడు తాను ఒక నటిగా అసూయపడ్డానంటూ తెలియజేసింది సారా అలీ ఖాన్. అలాంటి చిత్రాలలో నటించే అవకాశం తనకు ఎందుకు రాలేదనిపించిందని కూడా తెలియజేసింది.
ప్రతి ఒక్కరు కూడా ఎదుటివారిని చూసి అసూయ పడటం సహజంగానే ఉంటుంది.. కానీ వాటి వెనక ఎంత కష్టం ఉంటుందో ఎవరికీ అర్థం కాదు అంటూ తెలిపింది.. అందరూ కూడా ఆ కష్టాన్ని చూడరు కేవలం అవార్డును మాత్రమే చూస్తారని.. తాను కూడా అదే చేశానంటూ వెల్లడించింది సారా అలీఖాన్. గంగుబాయి కటియవాడి అని చిత్రంలో ఆలియా భట్ ఒక వేష పాత్రలో నటించింది. ఈ పాత్రకు గాను ఈమెకు నేషనల్ అవార్డు కూడా రావడం జరిగింది. ఇందులో ఎంతో అద్భుతమైన పాత్రలో నటించిన ఆలియా భట్ తన నటనతో ప్రశంసలు కూడా అందుకున్నది. మొత్తానికి ఆలియాకు నేషనల్ అవార్డు రావడం తనకు గెల్టిగా ఫీల్ అయ్యిందని తెలిపింది సారా.