టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ కలిగిన నటులలో ఒకరు అయినటువంటి నితిన్ తాజాగా రాబిన్ హుడ్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా ఈ రోజు అనగా మార్చి 28 వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ను మేకర్స్ కొన్ని రోజుల క్రితమే విడుదల చేశారు. ఇకపోతే నితిన్ కొంత కాలం క్రితం మాచర్ల నియోజకవర్గం అనే పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.

ఇది ఇలా ఉంటే రాబిన్ హుడ్ సినిమాకు వెంకీ కుడుమల దర్శకత్వం వహించాడు. గతంలో నితిన్ , వెంకీ కాంబినేషన్లో భీష్మ అనే మూవీ వచ్చి మంచి సక్సెస్ను అందుకుంది. ఇలా ఇప్పటికే వీరి కాంబోలో వచ్చిన భీష్మ మూవీ మంచి సక్సెస్ కావడంతో రాబిన్ హుడ్ సినిమాపై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ కు విడుదల అయిన 24 గంటల్లో 11.09 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఓవరాల్ గా చూసుకుంటే ఈ మూవీ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి 24 గంటల్లో మంచి రెస్పాన్స్ దక్కిన మాచర్ల నియోజకవర్గం సినిమాతో పోలిస్తే మాత్రం ఈ మూవీ 24 గంటల్లో ఎక్కువ వ్యూస్ ను దక్కించుకోలేకపోయింది.

మాచర్ల నియోజకవర్గం మూవీ ట్రైలర్ కు విడుదల అయిన 24 గంటల్లో 13.11 మిలియన్ వ్యూస్ దక్కాయి. అలా మాచర్ల నియోజకవర్గం మూవీ ట్రైలర్ కు రాబిన్ హుడ్ ట్రైలర్ తో  పోలిస్తే భారీ వ్యూస్ వచ్చాయి. కానీ మాచర్ల నియోజకవర్గం సినిమా మాత్రం బా క్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. మరి రాబిన్ హుడ్ సినిమాతో నితిన్ ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: