రంగస్థలం..రామ్ చరణ్ కి మగధీర మూవీ తర్వాత మళ్లీ అంతటి గుర్తింపుని తెచ్చి పెట్టిన మూవీ.. 2018 మార్చి 30న విడుదలైన ఈ సినిమా మరో రెండు రోజులు అయితే ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. అయితే ఇండస్ట్రీ హిట్ కొట్టిన రంగస్థలం మూవీ స్టార్ దర్శకుడు అయినటువంటి సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్,సమంత హీరో హీరోయిన్లుగా ఆది పినిశెట్టి, అనసూయ,రోహిణి, జగపతిబాబు, నరేష్,ప్రకాష్ రాజ్ వంటి ఎంతోమంది రంగస్థలం మూవీ లో కీ రోల్స్ పోషించారు. అయితే ఈ సినిమాలో సమంత పెళ్లయ్యాక కూడా చాలా బోల్డ్ గా నటించింది.ముఖ్యంగా పల్లెటూరి అమ్మాయి పాత్రలో సమంత కట్టెలు మోస్తూ చెరువులో దిగి బర్రెలు కడుగుతూ పల్లెటూరు అమ్మాయి లాగే నటించింది. అయితే ఈ సినిమాలో సమంత లుక్ చూసిన ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే. 

అంతే కాదు ఈ సినిమాలో రామ్ చరణ్ సమంత యాక్టింగ్ వేరే లెవల్ అని చెప్పుకోవచ్చు.అయితే బ్లాక్ బస్టర్ హిట్ అయిన రంగస్థలం మూవీ లో హీరోయిన్ అవకాశం మొదట సమంతకు కాకుండా మరో హీరోయిన్ కి వచ్చిందట. కానీ ఆ హీరోయిన్ చేతి దాకా వచ్చిన అవకాశాన్ని కాళ్లతో తన్నేసుకుందట.మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరయ్యా అంటే రింగుల జుట్టు సుందరి అనుపమ పరమేశ్వరన్.. రంగస్థలం మూవీ లో రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా నటించే అవకాశం మొదట అనుపమకే వచ్చిందట. సుకుమార్ మైండ్ లో హీరోయిన్ అనుపమనే ఉందట. కానీ ఈ స్టోరీ అనుపమకి చెప్పాక ఛీ ఛీ చనేను కట్టల మోపు ఎత్తుకోవడమేంటి.. చెరువులో దిగి బర్రెలు కడగడం ఏంటి..నో నో..నేను ఆ పని చేయను.

ఆ సన్నివేశాలు తీసేస్తే నటిస్తాను అంటూ చాలా పొగరుగా అన్సర్ ఇచ్చిందట. కానీ చిత్ర యూనిట్ మాత్రం పల్లెటూరు అమ్మాయి అంటే ఇలాంటి పాత్రలో నటిస్తేనే ఆ పాత్రకు మరింత ప్రాధాన్యత ఉంటుందని చెప్పినా కూడా అనుపమ వినకపోవడంతో అనుపమని పక్కన పెట్టి సమంతను ఈ సినిమాలో తీసుకున్నారు. అలా సిల్లీ రీజన్ తో అనుపమ రంగస్థలం మూవీలో హీరోయిన్ అవకాశాన్ని పోగొట్టుకుంది అంటూ అప్పట్లో కొన్ని వార్తలు వినిపించాయి. అయితే ఈ సినిమా విడుదలై ఏడు సంవత్సరాలు పూర్తి కావడంతో మళ్లీ ఈ వార్త నెట్టింట వైరల్ గా మారుతుంది

మరింత సమాచారం తెలుసుకోండి: