హిందువుల అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రాలలో శబరిమల అత్యంత ప్రసిద్ధమైంది. ఈ ఆలయంలో అయ్యప్ప స్వామిని దర్శించుకునే భక్తులు పాటించే నియమాలు అందరికీ తెలిసినవే. ఈ ఆలయంలో అన్యమతస్థులకు ప్రవేశమలేదు. క్రిష్టియన్ అయిన ఏసుదాసు అయ్యప్ప స్వామి పై ఎన్నో పాటలు పాడారు. అయ్యప్ప భజన జరుగుతుంటే ఆయన పాటలు వినిపిస్తూనే ఉంటాయి.


అలాంటి ఏసుదాసు అయ్యప్పను దర్శించుకోవాలని ఆలయంలోకి వెళ్ళాలని ప్రయత్నించినప్పుడు అప్పట్లో పెద్ద వివాదమే జరిగింది. ఇప్పుడు అలాంటి సంఘటన మరొకటి మోహన్ లాల్ విషయంలో జరగడం హాట్ టాపిక్ గా మారింది. గత కొంతకాలంగా మమ్ముట్టి ఆరోగ్యం పై అనేక వార్తలు వస్తున్నాయి. ఆయనకు క్యాన్సర్ అని కూడ కొన్ని మీడియా సంస్థలలో వార్తలు వస్తున్నాయి.


ఈపరిస్థితుల మధ్య మళయాళ సూపర్ స్టార్ అయ్యప్ప ఆలయానికి వచ్చి మమ్ముట్టి ఆరోగ్యం గురించి పూజలు చేయడం మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు కొన్ని హిందూ మత సంస్థలు మోహన్ లాల్ ముస్లిమ్ అయిన మమ్ముట్టి ఆరోగ్యం గురించి పూజలు చేయాలి అనుకుంటే అయ్యప్ప ఆలయానికి రావడం ఏమిటి అంటూ ప్రశ్నలు వేస్తున్నాయి. ఈవిషయం పై మోహన్ లాల్ స్పందిస్తూ తన ప్రియమిత్రుడు కోసం పూజలు చేయడంలో తప్పు ఏమిటి అంటూ తన అభిప్రాయాన్ని వెళ్ళడిస్తున్నాడు.


అంతేకాదు ఇది తన వ్యక్తిగత విషయమని అన్నారు మమ్ముట్టి స్వల్ప అనారోగ్యానికి గురయ్యారని ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నాడని కాబట్టి అభిమానుల్లో ఆందోళన అనవసరమని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం విశ్రాంతిలో ఉన్న మమ్ముట్టి త్వరలో మోహన్ లాల్‌తో కలిసి మహేష్ నారాయణన్ దర్శకత్వం వహించే చిత్రంలో నటించబోతున్నాడు. గతంలో అనేక సార్లు అనేక సినిమాలలో మమ్ముట్టి మోహన్ లాల్ కలిసి నటించారు. వీరిద్దరి మధ్య పోటీ ఉన్నప్పటికీ వీరిద్దరి స్నేహం గత కొన్ని దశాబ్ధాలుగా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం ఈన్యూస్ జాతీయ మీడియాకు కూడ హాట్ టాపిక్ గా మారడంతో రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: